నెల రోజుల్లో 11-16 శాతం రిటర్న్ ఇచ్చే టాప్ 5 టెక్నికల్ రికమండేషన్స్

నెల రోజుల్లో 11-16 శాతం రిటర్న్ ఇచ్చే టాప్ 5 టెక్నికల్ రికమండేషన్స్

మార్కెట్లు ఈ వారం ప్రారంభం నుంచి పాజిటివ్ గా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు సైతం కలిసి రావడంతో మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకే దిశగా సూచీలు కదులుతున్నాయి. నిఫ్టీ సోమవారం 10850 ఎగువన ముగిసింది. ఇది పాజిటివ్ సంకేతంగా చెప్పుకోవచ్చు. డెయిలీ చార్ట్స్ లో హ్యాంగింగ్ మ్యాన్ కాండిల్ స్టిక్ పాటర్న్ ఏర్పడింది. ఇది రివర్సల్ ప్యాటర్న్ గా భావించవచ్చు. 

ఇండెక్స్ పలు మార్లు రెసిస్టెన్ లైన్ ఎగువన 11,172 పైన ముగిసేందుకు ప్రయత్నించి విఫలమైంది. అయితే డైలీ  ఎంఏసీడీ(మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జన్స్) లైన్ మాత్రం పాజిటివ్ గా కదలాడుతోంది. యావరేజీ ప్రకారం చూసినట్లయితే ప్రస్తుతం కన్సాలిడేషన్ దశ ముగిసినట్లుగా భావించవచ్చు. 

ప్రస్తుతం 10790 స్థాయి ఎగువన సూచీ నిలిచినట్లయితే, ఇండెక్స్ 10929 స్థాయిని అలాగే 11100 స్థాయిని అందుకునే దిశగా కదులుతుంది.  ఒక వేళ 10790 స్థాయిని దిగువన బ్రేక్ చేసినట్లయితే 10710 వరకూ ప్రాఫిట్ బుకింగ్ ఉండే అవకాశం ఉంది. నిఫ్టీ ఆప్షన్స్ పరంగా 10700 మరియు 10800 స్ట్రైక్స్ వద్ద పుట్ రైటింగ్ కనిపిస్తోంది. అలాగే 11,000 మరియు 11,100 స్ట్రైక్ వద్ద కాల్ రైటింగ్ కనిపిస్తోంది.

శాంక్టమ్ వెల్త్ మేనేజ్ మెంట్ నుంచి టాప్ 5 టెక్నికల్ రికమెండేషన్స్ 

Yes Bank Limited: Buy| CMP: Rs 363| Stop loss: Rs 348| Target: Rs 410| Return 13%
ఈ స్టాక్ గత సంవత్సర కాలంగా రూ. 380 అలాగే రూ. 285 స్థాయిల మధ్య రేంజ్ బౌండ్‌ అవుతూ ఉంది. వీక్లీ చార్ట్స్ పరంగా చూసినట్లయితే ఈ స్టాక్ బ్రేకవుట్ లెవల్ దిగువన ట్రేడవుతున్నాయి.  బుల్లిష్ ఇన్వర్టెడ్ హెడ్, షోల్డర్ పాటర్న్ వీక్లీ చార్ట్స్ లో ఏర్పడ్డాయి.గత మూడు సెషన్లుగా ఈ స్టాక్ మంచి వాల్యూమ్స్ తో ట్రేడవుతూ మంచి బయ్యింగ్ ను కనబరుస్తోంది. 

Exide Industries Limited: Buy| CMP: Rs 268| Stop Loss: Rs 253| Target: Rs 310| Return 15%
ఈ స్టాక్ గత సంతవ్సర కాలంగా రూ.250 - రూ.195 మధ్య రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ ఏర్పడింది. మేనెలలో ఈ స్టాక్ రూ.270 స్థాయి వద్ద ఆల్ టైమ్ స్థాయిని అందుకుంది. అప్పటి నుంచి ఈ స్టాక్ రూ.270 - రూ.250 మధ్య కదలాడుతోంది. డైలీ చార్ట్స్ పరంగా చూసినట్లయితే ఈ స్టాక్ ఫ్రెష్ అప్ ట్రెండ్‌కు సిద్ధంగా ఉంది.  

Maruti Suzuki India Limited: Buy| CMP: Rs 9,375| Stop Loss: Rs 9,050| Target: Rs 10,400| Return 11%
ఈ స్టాక్ లాంగ్ టర్మ్ నుంచి వీక్లీ, మంత్లీ చార్ట్స్ లో హయ్యర్ టాప్స్, హయ్యర్ బాటమ్స్ వద్ద అప్ ట్రెండ్ కు గురవుతూ ఉంది. గత డిసెంబర్ లో ఈ స్టాక్ రై.9966 వద్ద ఆల్ టైం హై ను టచ్ చేయగా గడిచిన ఆరు నెలల్లో ఆ స్థాయి నుంచి దిగువకు చేరుకుంది. ప్రస్తుతం ఈ స్టాక్ రెసిస్టెన్ ట్రెండ్ లైన్ ను క్రాస్ చేసింది. ఇది వీక్లీ చార్ట్స్ లో లాంగ్ బుల్లిష్ కాండిల్ ను క్రాస్ చేసినట్లు భావించవచ్చు. 

KPIT Technologies Limited: Buy| CMP: Rs 280| Stop Loss: Rs 265| Target: Rs 320| Return 14%
గత సంవత్సర కాలంగా ఈ స్టాక్ అప్‌ట్రెండ్‌కు గురవుతూ హయ్యర్ టాప్స్, హయ్యర్ బాటమ్స్ ఏర్పాటు చేస్తోంది. గత వారమే ఈ స్టాక్ రూ.290 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని అందుకుంది. యావరేజ్ వాల్యూమ్స్ ఎగువన లాంగ్ బుల్లిష్ కాండిల్ ఏర్పడి ప్రస్తుతం ట్రేడవుతోంది. 

Berger Paints : Buy| CMP: Rs 301| Stop Loss: Rs 285| Target: Rs 340-350| Return 16%
ఈ స్టాక్ సైతం గత సంవత్సర కాలంగా రూ.280 - రూ. 230 మధ్య కదలాడుతోంది. ప్రస్తుతం నూతన గరిష్ట స్థాయి సమీపంలో ట్రేడవుతోంది. మే నుంచి ఈ స్టాక్ బారీ వాల్యూమ్స్ తో ట్రేడవుతోంది. గత రెండు సెషన్లలో ఈ స్టాక్ పాజిటివ్ ప్రైస్ యాక్షన్‌కు గురవుతోంది.Most Popular