రోడ్‌-కన్‌స్ట్రక్షన్‌ స్టాక్స్‌ ఎందుకు ఇబ్బంది పడుతున్నాయ్‌..?

రోడ్‌-కన్‌స్ట్రక్షన్‌ స్టాక్స్‌ ఎందుకు ఇబ్బంది పడుతున్నాయ్‌..?

గత ఏడాదికాలంగా దూసుకుపోతోన్న రోడ్-కన్‌స్ట్రక్షన్‌ స్టాక్స్‌ గత 3 నెలలుగా నీరసించాయి. కేంద్రం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసినప్పటికీ భూ సేకరణ, నిధుల సమీకరణ తదితర ఇబ్బందులు ఆయా కంపెనీలు ఇబ్బందులు పడుతోన్నాయి. ఎన్‌హెచ్‌ఏఐ నుంచి ఆర్డర్లు మెరుగ్గా ఉండటంతో మరికొన్ని సంవత్సరాలపాటు ఈ రంగంలో జోరు కొనసాగుతుందని నిపుణులు అంచనాలు వేసినప్పటికీ అవి తలక్రిందులయ్యాయి. దీంతో గత మూడు నెలలుగా రోడ్డు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్నాయి.

దిలీప్‌ బిల్డ్‌కాన్‌, సద్భావ్‌ ఇంజనీరింగ్‌, ఎన్‌సీసీ, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌లు నిరాశజనక ప్రదర్శనతో గత 3 నెలలుగా 22-42 శాతం నష్టపోయాయి. ఇదే సమయంలో బీఎస్ఈ మిడ్‌క్యాప్‌ 7.3శాతం, బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌ 0.04 శాతం క్షీణించాయి. ఈ సెగ్మెంట్లోని ఇతర స్టాక్స్‌ విషయానికి వస్తే 12-20 శాతం పతనమయ్యాయి. నిర్వహణలో ఆలస్యం, నిధుల సమీకరణ కోసం ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావడం, వడ్డీరేట్ల పెంపు, రాజకీయ ఇబ్బందులే దీనికి కారణమని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

FY18లో 8వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ నుంచి పలు కంపెనీలు ఆర్డర్లు పొందాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ 10వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం. అభివృద్ధికి ఆర్డర్లు రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేశాయి. అయితే కంపెనీలకు ఒక్కసారిగా భారీ ఆర్డర్లు రావడంతో సగటు బుక్‌ టు బిల్‌ రేషియో 3-4 రెట్లు పెరిగింది. కంపెనీలకు ఆర్డర్ల వరద కొనసాగడంతో వాటి నిర్వహణ చేపట్టడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా నిధుల సమీకరణ అనేది కంపెనీలకు తలకు మించిన భారం అయింది. పలు కంపెనీలను సంప్రదించినప్పటికీ వాటితో ఒప్పందం కుదుర్చుకోవడంలో ఆయా సంస్థలు విఫలమయ్యాయి. దీనికి తోడు రోడ్‌-కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలకు రుణ సమస్యలు కూడా ఇబ్బందులు పెట్టాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జాసని అభిప్రాయపడ్డారు. Most Popular