టాటా సన్స్‌కు ఊరట.. మిస్త్రీ ఆరోపణలు తూచ్... !!!

టాటా సన్స్‌కు ఊరట.. మిస్త్రీ ఆరోపణలు తూచ్... !!!

టాటా సన్స్‌పై ఆ సంస్థ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ చేసిన ఆరోపణలను నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునలర్ కోర్టు కొట్టేసింది. రెండు సంవత్సరాల పాటు సాగిన ఈ కేసులో చివరకు టాటా సన్స్‌కు అనుకూలమైన తీర్పు వచ్చింది. మైనార్టీ షేర్ హోల్డర్ల ప్రయోజనలను విఘాతం కలిగిస్తున్నారని, నిర్వాహణలలో లోపలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ గతంలో మిస్త్రీ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజాలూ లేవని ఎన్.సి.ఎల్.టి అభిప్రాయపడింది.  టాటా సన్స్ నిర్వాహణలో రతన్ టాటా, ఎన్ఏ సూనావాలా అనవసర జోక్యం చేసుకుంటున్నారనే విషయాన్ని కూడా కోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ బిఎస్‌వి ప్రకాశ్ కుమార్, జస్టిస్ వి నల్లసేనాపతితో కూడిన బెంచ్ సుమారు నాలుగు నెలల పాటు ఇరువురి వాదనలనూ సుదీర్ఘంగా విచారించింది. చివరకు టాటా సన్స్ బోర్డులో మిస్త్రీని తిరిగి చేర్చుకోవాలన్న పిటిషన్‌ను తిరస్కరించింది. మిస్త్రీ అటు బోర్డుకు, ఇటు కంపెనీకి వ్యతిరేకంగా ప్రవర్తించారని తేల్చింది. 

టాటా సన్స్‌కు అనుకూలంగా వచ్చిన తీర్పు నేపధ్యంలో టాటా గ్రూప్ స్టాక్స్‌లో మిశ్రమ స్పందన కనిపించింది. టాటా మోటార్స్, టాటా పవర్, టీసీఎస్, టాటా స్టీల్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా కాఫీ షేర్లు ఒకటిన్నర నుంచి మూడు శాతం  వరకూ పెరిగాయి. Most Popular