ఎఫ్‌పీఐల దన్ను- వీమార్ట్‌ రిటైల్‌కు ఆకాశమే హద్దు!

ఎఫ్‌పీఐల దన్ను- వీమార్ట్‌ రిటైల్‌కు ఆకాశమే హద్దు!

ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న రిటైల్‌ సంస్థ వీమార్ట్‌ కౌంటర్‌కు మరోసారి భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 12 శాతం దూసుకెళ్లింది. రూ. 3140 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 3294 వరకూ జంప్‌చేసింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం! గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలోనూ ఈ కౌంటర్ 14 శాతం ఎగసింది.


104 శాతం ర్యాలీ
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో 1 శాతంమేర వాటాను పెంచుకున్నట్లు వెల్లడికావడంతో ఇటీవల వీమార్ట్‌ రిటైట్‌ లిమిటెడ్‌ షేరు ర్యాలీ చేస్తోంది. కాగా.. 2018లో వీమార్ట్‌ రిటైల్‌ షేరు 104 శాతం దూసుకెళ్లింది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 5 శాతమే పెరిగింది. గతేడాది(2017)లోనూ ఈ కౌంటర్‌ 220 శాతం లాభపడగా.. సెన్సెక్స్‌ 28 శాతం పెరిగింది. జూన్‌చివరికల్లా కంపెనీలో ఎఫ్‌పీఐల వాటా 32.24 శాతానికి చేరింది. డిసెంబర్‌ 2016లో ఈ వాటా 25.84 శాతంకాగా.. 2017 డిసెంబర్‌లో 30.75 శాతానికి పెరిగింది.


ఫలితాల దన్ను
మార్చితో ముగిసిన 2017-18లో వీమార్ట్‌ రిటైల్‌ నికర లాభం 77 శాతం జంప్‌చేసి రూ. 78 కోట్లకు చేరింది. ద్వితీయ, తృతీయస్థాయి పట్టణాలలో ఫ్యాషన్‌ ఆధారిత రిటైల్‌ విక్రయాలపై దృష్టిపెట్టిన సంస్థ ఆదాయం సైతం 22 శాతం పెరిగి రూ. 1222 కోట్లను తాకింది. ఈ బాటలో భవిష్యత్‌లోనూ కంపెనీ మంచి పనితీరును చూపగలదన్న అంచనాలు షేరుకి డిమాండ్‌ను పెంచుతున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు.



Most Popular