ఐపీఓ మార్కెట్‌ కళ కళ

ఐపీఓ మార్కెట్‌ కళ కళ

గతంలో పబ్లిక్‌ ఇష్యూ అంటేనే ఆమడదూరం పరుగెత్తే కంపెనీలు ఈ ఏడాది భారీగా నిధులు సేకరించేందుకు ఐపీఓ బాట పట్టాయి. తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ దేశీయ మార్కెట్లు జోరుమీదుండటంతో కంపెనీలు ఐపీఓకు వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 18 సంస్థలు ఐపీఓకు వచ్చాయి. గత నెల 30నాటికి మొత్తం రూ.23,670 కోట్ల నిధులను సమీకరించాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది రెట్టింపు మొత్తం కావడం విశేషం. 2017 తొలి అర్ధభాగంలో 13 కంపెనీలు ఐపీఓకు వచ్చి రూ.12వేల కోట్ల నిధులను సమీకరించాయి. 

ఈ ఏడాది 50కి పైగా సంస్థలు ఐపీఓకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌, లోధా డెవలపర్స్‌, రైల్‌ వికాస్ నిగమ్‌ తదితర సంస్థలున్నాయి. ఇప్పటికే 18 సంస్థలు ఐపీఓ కోసం రెగ్యులేటరీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ పొందగా.. 28 సంస్థలు సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించాయి. 

ఈ ఏడాది వచ్చిన ఐపీఓల్లో బంధన్‌ బ్యాంక్‌ అతిపెద్ద ఐపీఓగా చెప్పొచ్చు. ఈ సంస్థ రూ.4,473 కోట్ల నిధులను ఐపీఓ ద్వారా సేకరించింది. హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (రూ.4,229 కోట్లు), ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ (రూ.3,515 కోట్లు), వరోక్‌ ఇంజనీరింగ్‌(రూ.1,955 కోట్లు), ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (రూ.1,844 కోట్లు), లెమన్‌ట్రీ హోటల్స్‌ (రూ.1,040 కోట్లు)లు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల విషయానికి వస్తే భారత్‌ డైనమిక్స్‌, రైట్స్‌ లిమిటెడ్‌, మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిధాని)లు ఈ ఏడాది ఐపీఓకు వచ్చాయి.

ఈ ఏడాది ఐపీఓకు వచ్చిన సంస్థల్లో మెజార్టీ సంస్థలు ప్రీమియంతో లిస్టయ్యాయి. మార్కెట్లు జోరుమీదుండటంతో పలు ఐపీలకు చక్కని స్పందన లభించింది. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');