6 నెలలు ఓపికపట్టగలరా..? ఐతే 20% లాభం ఇచ్చే షేర్లివి

6 నెలలు ఓపికపట్టగలరా..? ఐతే 20% లాభం ఇచ్చే షేర్లివి

విలువ కలిగిన షేర్లు( వేల్యూ బై) స్టాక్స్‌కోసం అన్వేషణ ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. అందులోనూ నిఫ్టీ గత గరిష్టాలను దాటలేక ఆపసోపాలు పడుతున్న వేళ ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏ షేరు కొందామని చూసినా..దాదాపు సగం అయి కన్పిస్తున్నవేళ ఎలాంటి నిర్ణయం ఎటు పరిణమిస్తుందో తెలీక అలానే చూస్తుండిపోవడం కూడా కద్దు. ధర్మేష్ షా అనే ఐసిఐసిఐ డైరక్ట్ సంస్థకి చెందిన ఆర్ధిక విశ్లేషకులు రెండు లార్జ్ క్యాప్, ఒక మిడ్ క్యాప్ స్టాక్ రానున్న 3 నెలల్లో మంచి లాభాలు ఇచ్చే అవకాశముందని సూచిస్తున్నారు.ఆయన అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూలతలు ఉన్నా కూడా నిఫ్టీ గత వారం మంచి మొమెంటమ్ కనబరిచింది. ఒక్క జూన్ నెలలోనే 10550 స్థాయి
వద్ద మూడు సార్లు మద్దతు తీసుకుని పైకి లేచింది.ఈ కాలంలో చమురు ధరలు పెరుగుదల, రూపాయి మారకం విలువ భారీగా తగ్గిపోవడం, వాణిజ్యయుధ్దాలనే అంశాలు తమ ప్రభావం చూపించాయి. అయినా కూడా నిఫ్టీ తిరిగి ఊర్ధ్వముఖంగా పయనించడం సానుకూల సంకేతాలుగా ధర్మేష్ షా చెప్తున్నారు. ఈ దశలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 18శాతం స్మాల్‌క్యాప్ 28శాతం నష్టపోయాయ్. గత రెండు సెషన్లుగా ఈ రెండు సూచీలు మంచి బలంతో పుంజుకున్నట్లు కన్పిస్తోంది. వచ్చే ఆరునెలలకాలం వరకూ వేచి చూస్తే  8-24శాతం వరకూ లాభం వచ్చే స్టాక్స్‌ని ధర్మేష్ షా సూచిస్తున్నారు. అవి

మారికో : Buy| CMP: Rs 343| Target: Rs 370| Stop Loss: Rs 324| Return 8%| Time frame: 3 months
2018 మేనెల నాటి కనిష్టస్థాయి అయిన రూ.305 నుంచి సంస్థ షేరు మంచి స్పీడ్ కనబరుస్తోంది. మీడియం టర్మ్ ఇన్వెస్టర్లు ఇందులో కొనుగోళ్లు చేపట్టడంతో ట్రెండ్ రివర్సల్ అవుతుందని చెప్తున్నారు. గత పదినెలల క్రితం నుంచి తీసుకున్నట్లైతే మారికో షేరు రూ.335-330 మధ్య కన్సాలిడేట్ అవుతోంది. దీంతో కంట్రాక్టింగ్ ట్రయాంగిల్ ప్యాట్రెన్‌ను చార్టులపై ఏర్పరచిందని అంటున్నారు. ఇది షేరు ప్రస్తుత స్థాయి నుంచి పైకి వెళ్తోందని చెప్పడానికి నిదర్శనమంటారు. కాబట్టి రూ.324 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకుంటే రూ. 370వరకూ షేరు పెరగవచ్చని ధర్మేష్ షా సూచించారు.

గ్లాక్సోస్మిత్‌లైన్  :CMP: Rs 2,902| Target: Rs 3,490| Stop loss:Rs 2,590|Return 20%| Time frame: 6 months
గత రెండేళ్ల నుంచీ గ్లాక్సోస్మిత్‌లైన్‌ కౌంటర్లో నడిచిన దశ నుంచి బ్రేక్ అవుట్( బైటపడినట్లు) కన్పిస్తోంది. ప్రస్తుతం రూ.2902 వద్ద ఉన్న ఈ ధర ఆరు నెలల కాలంలో రూ.3490వరకూ వెళ్లవచ్చిన ధర్మేష్ షా సూచించారు. అంటే 20శాతం లాభం అంచనా వేశారు. ఏప్రిల్ 2016న నమోదు అయిన రూ.3872 నుంచి నష్టపోవడం ప్రారంభించిన ఈ షేరు ధర మార్చి 2018న రూ.2020కి పతనమైంది. ఐతే ఇప్పుడిప్పుడే ఇందులో కొనుగోళ్లు ప్రారంభం కావడంతో పాటు రూ.2590 వద్ద సపోర్ట్ బేస్ ఏర్పరుచుకుంది.  అలానే మూడు నెలల్లోనే రూ.2020 నుంచి రూ.2700కి పెరగడం గమనార్హం. వేగంగా రికవరీ అవడం షేరు పెరుగుదలకి సంబంధించిన సమర్ధతకి సంకేతంగా చూపిస్తున్నారు. అలానే వారానికి 51వేల షేర్లు చేతులు మారడం కూడా వాల్యూమ్స్‌ బ్రేకవుట్‌కి నిదర్శనంగా చెప్తున్నారు

మహారాష్ట్ర సీమ్‌లెస్ : Buy|CMP: Rs 439| Target: Rs 548| Stop loss: Rs 402| Return 24%|Time frame: 6 months
ఏడేళ్ల నిరోధస్థాయి నుంచి 2017 ఆగస్ట్‌లో బైటపడిన మహారాష్ట్ర సీమ్‌లెస్ ఆ తర్వాతికాలంలో అదే జోరు ప్రదర్శించి రూ.552 వరకూ వెళ్లింది. గత మూడునెలల కాలాన్ని పరిశీలిస్తే,  మరో అప్‌మూవ్‌ని పునాది వేసుకున్నట్లు కన్పిస్తోంది. గత 52వారాల గరిష్టమైన రూ.552 నుంచి పతనమైన తర్వాత ఇప్పుడు ఫ్రెష్ ఎంట్రీ( కొత్త కొనుగోలుకు)కి అవకాశంగా ధర్మేష్ షా చెప్తున్నారు. రూ.415వద్ద బలమైన మద్దతు ధర కలిగిన మహారాష్ట్రసీమ్‌లెస్ రాగల 6 నెలల్లో రూ.548 వరకూ పెరగవచ్చని సూచించారుMost Popular