ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. మంచి రిటర్న్స్‌ ఇస్తాయట..!

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. మంచి రిటర్న్స్‌ ఇస్తాయట..!

ట్రేడ్‌వార్‌, యూరోప్‌ రాజకీయ అనిశ్చితి ప్రపంచ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్నాయి. ఈ సమయంలో కొన్ని స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే ఆగస్ట్‌ చివరినాటికి 8-13 శాతం రిటర్న్స్‌ వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు శాంక్టం వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ హెడ్‌ ఆశిష్‌ చతుర్‌మెహతా. వచ్చే 1-2 నెలల్లో చక్కని రిటర్న్స్‌ ఇచ్చే స్టాక్స్‌ వివరాలేంటో మీరే చదవండి.

Asian Paints: Buy| CMP: Rs 1,293| Stop loss: Rs 1,250| Target: Rs 1,400| Return 8%

గత 9 నెలలుగా రూ.1260 మరియు రూ.1,100 లెవెల్స్‌ మధ్య కదలాడుతోన్న ఈ స్టాక్‌ ఈ ఏడాది మేలో ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి రూ.1,332ని టచ్‌ చేసింది. ఈ స్టాక్‌ అమ్మకాల ఒత్తిడికి లోనైతే గత గరిష్ట స్థాయి రూ.1,260 వద్ద స్ట్రాంగ్‌ సపోర్ట్‌ లభించే అవకాశాలున్నాయి. ఆ తర్వాత బౌన్స్‌ బ్యాక్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది. సోమవారం ట్రేడింగ్‌ను గమనిస్తే ఈ స్టాక్‌ ప్రైస్‌ మూమెంట్‌ లాంగ్‌ టర్మ్‌ బుల్లిష్‌ను చూపిస్తోంది. చక్కని వాల్యూమ్స్‌ కూడా నమోదు అవుతుండటంతో ప్రస్తుత లెవల్స్‌లో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయడం ఉత్తమమంటున్నారు ఆశిష్‌ చతుర్‌ మెహతా. ఏషియన్‌ పెయింట్స్‌ టార్గెట్‌ ధర రూ.1,400

Infosys Limited: Buy| CMP: Rs 1,335| Stop loss: Rs 1,290| Target: Rs 1,450| Return 8.6%

గత రెండేళ్ళుగా రూ.1,280 మరియు రూ.900 లెవల్స్‌లో కదలాడుతోన్న ఈ స్టాక్‌కు సోమవారం బ్రేకవుట్‌ వచ్చింది. దీంతో నిన్న ఈ స్టాక్‌ ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి రూ.1,340ని టచ్‌ చేసింది. ఈ స్టాయి నుంచి ర్యాలీ ఇలాగే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఆల్‌టైమ్‌ హై రికార్డులను తిరగరాసే అవకాశముంది. ప్రస్తుత లెవెల్స్‌లో ఈ స్టాక్‌ను తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయడం ఉత్తమం. వచ్చే నెల చివరి నాటికి ఈ స్టాక్‌ దాదాపు 9శాతం రిటర్న్‌ ఇచ్చే ఛాన్స్‌వుంది. 

Godrej Industries Limited: Buy| CMP: Rs 618| Stop loss: Rs 585| Target: Rs 700| Return 13%

లాంగ్‌టర్మ్‌ ఛార్ట్‌ ప్రకారం చూస్తే గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌లో అప్‌ట్రెండ్‌ కనిపిస్తోంది. గత 11 నెలలుగా ఈ స్టాక్‌ రూ.699-512 లెవెల్స్‌ మధ్య న్యారో రేంజ్‌లో కదలాడింది. రూ.550-512 మధ్య ఎన్నో సమయాల్లో ఈ స్టాక్‌లో బౌన్స్‌బ్యాక్‌ వచ్చింది. వీక్లీ ఛార్ట్‌ ప్రకారం రూ.699, రూ.646 వద్ద రెసిస్టెన్స్‌ ఎదురయ్యే అవకాశముంది. ప్రస్తుత లెవల్స్‌ నుంచి రూ.585 స్టాప్‌లాస్‌తో తగ్గినప్పుడల్లా ఈ స్టాక్‌లో కొత్త పొజీషన్స్‌ తీసుకోవచ్చు. గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ టార్గెట్‌ ధర రూ.700.

Sundram Fasteners Limited: Buy| CMP: Rs 643| Stop loss: Rs 615| Target: Rs 720| Return 12%

డైలీ ఛార్ట్‌, వీక్లీ ఛార్ట్‌ ప్రకారం చూస్తే వచ్చే రెండు నెలల్లో చక్కని రిటర్న్‌ అందించేలా సుందరం ఫాస్ట్‌నర్స్‌ కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు ఆశిష్‌ చతుర్‌మెహతా. కన్సాలిడేషన్‌ జోన్‌లో కదలాడుతోన్న ఈ స్టాక్‌ గత 4 నెలలుగా పాజిటివ్‌ జోన్‌లో ఉంది. 100 రోజుల సగటు కదలికల స్థాయి ఈ స్టాక్‌కు సపోర్ట్‌ లెవెల్‌గా చెప్పొచ్చు. ప్రస్తుత లెవెల్స్‌లో రూ.615 స్టాప్‌లాస్‌తో తగ్గినప్పుడల్లా ఈ స్టాక్‌లో కొత్త పొజిషన్లు తీసుకునేందుకు ప్రయత్నించండి. ఈ స్టాక్‌ టార్గెట్‌ ధర రూ.720

Indiabulls Housing Finance Limited: Sell| CMP: Rs 1,115| Stop loss: Rs 1,160| Target: Rs 1,020| Return 8.5%

వీక్లీ ఛార్ట్‌ ప్రకారం హెడ్‌ అండ్‌ షోల్డర్‌ ప్యాట్రన్‌లో బేరిష్ ట్రెండ్‌గా కనిపిస్తోంది ఇండియా బుల్స్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌. డౌన్‌సైడ్‌లో 200 డే మూమింగ్‌ యావరేజ్‌ వద్ద ఈ స్టాక్‌కు రెసిస్టెన్స్‌ కనిపిస్తోంది. ప్రస్తుత లెవల్స్‌లో ఈ స్టాక్‌ను అమ్మేయండి. ఈ స్టాక్‌ టార్గెట్‌ ధర రూ.1,020.

గమనిక : పైన ఇచ్చిన రికమండేషన్స్ కేవలం అవగాహన కోసం మాత్రమే. లావాదేవీలపై ప్రాఫిట్‌ యువర్‌ ట్రేడ్‌ డాట్‌ఇన్‌కు ఎలాంటి సంబంధం లేదు. Most Popular