ఫైన్‌ ఆర్గానిక్స్ లిస్టింగ్‌ ఓకే!

ఫైన్‌ ఆర్గానిక్స్ లిస్టింగ్‌ ఓకే!

షేరుకి రూ. 783 ధరలో ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ బీఎస్‌ఈలో రూ. 32 లాభంతో రూ. 815 వద్ద లిస్టయ్యింది. తదుపరి రూ. 823 వరకూ ఎగసింది. రూ. 802 వద్ద ఇంట్రాడే కనిష్టానికి సైతం చేరింది. ప్రస్తుతం 3.4 శాతం పెరిగి రూ. 809 వద్ద ట్రేడవుతోంది. జూన్‌ 22న ముగిసిన ఇష్యూకి 9 రెట్లు అధికంగా స్పందన లభించింది. తద్వారా కంపెనీ రూ. 601 కోట్లు సమీకరించింది. ఇష్యూలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్లు సమీకరించింది. 
కంపెనీ వివరాలివీ 
ముంబైకి చెందిన ఫైన్‌ ఆర్గానిక్స్‌ 2002లో ప్రారంభమైంది. ఓలియోకెమికల్స్‌ను ఉత్పత్తి చేసే ఈ సంస్థ మహారాష్ట్రలో మూడు ప్లాంట్లు కలిగి ఉంది. మొత్తం 387 రకాల ప్రొడక్టులను కంపెనీ తయారు చేస్తోంది. వార్షికంగా 64,300 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కంపెనీ.. ఆర్‌అండ్‌డీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గత మూడేళ్లలో 46 కొత్త ఉత్పత్తులను డెవలప్‌ చేసింది. కంపెనీ కస్టమర్ల జాబితాలో పార్లే, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ తదితర దిగ్గజ కంపెనీలున్నాయి. Most Popular