లిస్టింగ్‌తో రైట్స్‌ పరుగు...!

లిస్టింగ్‌తో రైట్స్‌ పరుగు...!

ఇటీవలే అత్యంత సక్సెస్‌ఫుల్‌గా పబ్లిక్‌ ఇష్యూ ముగించుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్‌(RITES) స్వల్ప ప్రీమియంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 185కాగా బీఎస్ఈలో రూ. 190 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. తదుపరి రూ. 206 వరకూ ఎగసింది. ప్రస్తుతం 6 శాతం లాభంతో రూ. 201 వద్ద ట్రేడవుతోంది. ఇష్యూ  67 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. తద్వారా కంపెనీ రూ. 466 కోట్లు సమీకరించింది. 

కంపెనీ వివరాలివీ
1974లో ప్రారంభమైన రైట్స్‌(RITES) 2008లో పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా అవతరించింది. రవాణా మౌలిక సదుపాయాలకు సంబంధించిన కన్సల్టెన్సీ సేవలు, ఇంజనీరింగ్‌, డిజైన్‌ విభాగాల్లో సేవలు అందిస్తోంది. దాదాపు మూడింట రెండువంతుల ఆదాయం ఈ రంగాల నుంచే లభిస్తోంది. లీజింగ్‌, ఎగుమతుల ద్వారా కంపెనీ 30 శాతం ఆదాయం ఆర్జిస్తోంది. గత 44 ఏళ్ళ కాలంలో ఈ సంస్థ 55 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, దక్షిణ అమెరికా తదితర దేశాలకు సేవలను విస్తరించింది.Most Popular