పురానిక్ బిల్డర్స్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట!

పురానిక్ బిల్డర్స్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట!

ముంబైకు చెందిన రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్ డెవలపర్‌ పురానిక్‌ బిల్డర్స్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ మార్కెట్ల నియత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకుంది. ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ ద్వారా చేపట్టతలపెట్టిన ఐపీవో ద్వారా రూ. 1,000 కోట్లను సమీకరించాలని భావిస్తున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. ఇందుకు అనుగుణంగా రూ. 810 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు కంపెనీ ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు 18.59 లక్షల షేర్లను విక్రయించనున్నారు. Most Popular