ఐపీవోకు హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ రెడీ!

ఐపీవోకు హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ రెడీ!

ప్రయివేట్‌ రంగ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఐపీవోకు అనుమతించాల్సిందిగా అభ్యర్థిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచుల్‌ ఫండ్‌ మార్చిలో సెబీకి దరఖాస్తు చేసుకుంది. కాగా.. ఐపీవోలో భాగంగా 2.21 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. వీటలో అర్హతగల కంపెనీ ఉద్యోగులకు 3.2 లక్షల షేర్లు, అర్హతగల హెచ్‌డీఎఫ్‌సీ వాటాదారులకు 24 లక్షల షేర్లను విక్రయించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. Most Popular