లిస్టింగ్‌కు రైట్స్‌(RITEs) రెడీ..!

లిస్టింగ్‌కు రైట్స్‌(RITEs) రెడీ..!

ఇటీవలే అత్యంత సక్సెస్‌ఫుల్‌గా పబ్లిక్‌ ఇష్యూ ముగించుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్‌(RITES) స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో సోమవారం లిస్ట్‌కానుంది. షేరుకి రూ. 185 ధరలో చేపట్టిన ఇష్యూ  67 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. తద్వారా కంపెనీ రూ. 466 కోట్లు సమీకరించింది. రైల్వే ఇంజినీరింగ్, లాజిస్టిక్స్‌ కన్సల్టెన్సీగా సేవలందిస్తోన్న రైట్స్‌ ఐపీఓలో భాగంగా 12% వాటాకు సమానమైన 2.52 కోట్ల షేర్లను విక్రయించింది. ఇష్యూ ధరలో ఉద్యోగులకు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు రూ. 6 డిస్కౌంట్‌ ఇచ్చింది. 

కంపెనీ వివరాలివీ
1974లో ప్రారంభమైన రైట్స్‌(RITES) 2008లో పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా అవతరించింది. రవాణా మౌలిక సదుపాయాలకు సంబంధించిన కన్సల్టెన్సీ సేవలు, ఇంజనీరింగ్‌, డిజైన్‌ విభాగాల్లో సేవలు అందిస్తోంది. దాదాపు మూడింట రెండువంతుల ఆదాయం ఈ రంగాల నుంచే లభిస్తోంది. లీజింగ్‌, ఎగుమతుల ద్వారా కంపెనీ 30 శాతం ఆదాయం ఆర్జిస్తోంది. గత 44 ఏళ్ళ కాలంలో ఈ సంస్థ 55 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, దక్షిణ అమెరికా తదితర దేశాలకు సేవలను విస్తరించింది. 



Most Popular