ఫైన్‌ ఆర్గానిక్ లిస్టింగ్‌ సోమవారం!

ఫైన్‌ ఆర్గానిక్ లిస్టింగ్‌ సోమవారం!

షేరుకి రూ. 783 ధరలో ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ సోమవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. జూన్‌ 22న ముగిసిన ఇష్యూకి 9 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 53,65,497 షేర్లను ఆఫర్‌ చేయగా.. 4,78,34,875 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. తద్వారా రూ. 601 కోట్లు సమీకరించింది. ఇష్యూలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 783 ధరలో 15 ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలకు దాదాపు 23 లక్షల షేర్లను కేటాయించింది. యాంకర్‌ సంస్థలలో గోల్డ్‌మన్‌ శాక్స్ ఇండియా, డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ ఈక్విటీ ఫండ్‌, ఐడీఎఫ్‌సీ స్మాల్‌ క్యాప్‌ ఫండ్ తదితరాలున్నాయి.

కంపెనీ వివరాలివీ 
ముంబైకి చెందిన ఫైన్‌ ఆర్గానిక్స్‌ 2002లో ప్రారంభమైంది. ఓలియోకెమికల్స్‌ను ఉత్పత్తి చేసే ఈ సంస్థ మహారాష్ట్రలో మూడు ప్లాంట్లు కలిగి ఉంది. మొత్తం 387 రకాల ప్రొడక్టులను కంపెనీ తయారు చేస్తోంది. వార్షికంగా 64,300 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కంపెనీ.. ఆర్‌అండ్‌డీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గత మూడేళ్లలో 46 కొత్త ఉత్పత్తులను డెవలప్‌ చేసింది. కంపెనీ కస్టమర్ల జాబితాలో పార్లే, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ తదితర దిగ్గజ కంపెనీలున్నాయి. 



Most Popular