స్థిరాదాయం పొందాలనుకుంటే..!

స్థిరాదాయం పొందాలనుకుంటే..!

ఈక్విటీ మార్కెట్స్‌ వరుస పతనాలతో ఎప్పుడూ టెన్షన్‌ పడే బదులు.. తక్కువగా వచ్చినప్పటికీ స్థిరంగా వచ్చే ఆదాయమే బెస్ట్‌ అని చాలా మంది భావిస్తుంటారు. అయితే స్టాక్‌ మార్కెట్లు జోరుమీదుండటంతో కొంతమంది చూపు ఇటువైపు కూడా పడుతుంది. అయితే వారికి మార్కెట్‌పై సరైన అవగాహన లేకపోవడంతో అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మార్కెట్‌పై సరైన అవగాహన లేనివారికి తక్కువ రాబడి వచ్చినప్పటికీ స్థిరాదాయ వనరులైన ఎన్‌సీడీలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ మెట్యురిటీ ప్లాన్స్‌ (FMP) బెస్ట్‌ అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్లు వరుస పతనాలకు లోనవుతుండటంతో ఈ పద్ధతులు ఎంపిక చేసుకునేవారికి ఇదే సరైన సమయమని వారంటున్నారు.

AA+ రేటింగ్‌ కలిగిన శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ ఎన్‌సీడీ ద్వారా 9.5శాతం వడ్డీరేటును ఆఫర్‌ చేస్తోంది. ఇదే సమయంలో 1-2 సంవత్సరాల వ్యవధిగల వివిధ డిపాజిట్లపై కార్పొరేట్‌ సంస్థలైన బజాజ్‌ ఫైనాన్స్‌, మహీంద్రా ఫైనాన్స్‌, డీహెచ్‌ఎఫ్‌లు 7.5 నుంచి 8.6 శాతం వడ్డీరేటును ఇస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్‌ నుంచి ఎఫ్‌ఎంపీలు 8-8.5 శాతం, సావరిన్‌ ఆర్‌బీఐ బాండ్లు 7.75 శాతం వడ్డీరేటును ఆఫర్‌ చేస్తున్నాయి. దీంతో తక్కువ పన్ను పరిధిలో ఉన్న పెట్టుబడిదారులు NCDలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. "ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం ఇప్పటికే వడ్డీరేట్లు పెరిగాయి. త్వరలో మరింత పెరగడానికి ఆస్కారముంది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు అధిక లాభాలతో తమని తాము లాక్‌ చేయటానికి ఇదే సరైన సమయం" అని ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌ మంగ్లూనియా చెప్పారు. 

FMP వడ్డీరేటు 8.1 శాతం, ద్రవ్యోల్బణం 4 శాతం ఉంటే  పోస్ట్-టాక్స్ రిటర్న్ 7.3 శాతంగా ఉంటుంది, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ నుండి 6-6.2 శాతం ఉంటుంది. ఇన్వెస్టర్లు మరో 4 స్థిరాదాయ పద్ధతులను ఎంపిక చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన రిటర్న్స్‌ తదితర వివరాలను దిగువ పట్టికలో చూడండి.Most Popular