వరోక్‌ ఇంజినీరింగ్‌కు యాంకర్‌ నిధులు!

వరోక్‌ ఇంజినీరింగ్‌కు యాంకర్‌ నిధులు!

ఆటో విడిభాల సంస్థ వరోక్‌ ఇంజినీరింగ్ పబ్లిక్‌ ఇష్యూ నేటి(జూన్‌ 26) నుంచి ప్రారంభంకాగా సోమవారం యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమీకరించింది. నోమురా, కెనడియన్‌ పెన్షన్‌ ఫండ్‌, స్మాల్‌ క్యాప్‌ వరల్డ్‌ ఫండ్‌ తదితర 30 ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థల నుంచి రూ. 584 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 967 ధరలో 60.36 లక్షల షేర్లను కేటాయించింది.
గురువారం ముగింపు
ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 965-967కాగా.. తద్వారా రూ. 1955 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. 28న(గురువారం) ముగియనున్న ఇష్యూలో భాగంగా 2.02 కోట్ల షేర్లను కంపెనీ విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్‌ తరంగ్ జైన్‌ 17.52 లక్షల షేర్లు అమ్మనుండగా, ఒమెగా టీసీ హోల్డింగ్స్‌ 1.19 కోట్ల షేర్లు, టాటా కేపిటల్‌ 15.52 లక్షల షేర్లకుపైగా విక్రయించనున్నాయి. కంపెనీ ఉద్యోగులకు షేరుకి రూ. 48 డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది. Most Popular