ఫామ్ నంబర్ 16 లేదా..ఐనా ఫర్లేదు పన్ను కట్టేయండి ఇలా...!

ఫామ్ నంబర్ 16 లేదా..ఐనా ఫర్లేదు పన్ను కట్టేయండి ఇలా...!

మీ సంస్థ మీకు ఫామ్ నంబర్ 16 ఇవ్వకుండా వేధించినా..విసిగిస్తున్నా..ఇకపై ఆ జంఝాటం లేదు..మేం చెప్పే పద్దతిలొ ఆదాయపు పన్ను మదించి దాఖలు చేయవచ్చు అదెలానొ ఒక్కొ మెట్టు ద్వారా చూద్దాం

ముందు పే స్లిప్స్ కలెక్ట్ చేసుకొండి: 

మీరు  ఏ సంవత్సరానికైతే పన్ను మదింపు చేయాలనుకుంటున్నారొ ఆ ఏడాదికి సంబంధించిన అన్ని పే స్లిప్పులూ దగ్గర పెట్టుకొండి. మధ్యలొ ఇంకొ సంస్థకి వెళ్లినా సరే అవి..ఇవి రెండూ కలిపి దగ్గర పెట్టుకొవాలి.

మొత్తం జీతం లెక్కింపు:

అన్ని పే స్లిప్పులలొని జీతం ఎంతొ లెక్కగట్టండి. మీ సంస్థ మీతరపున కట్టే పిఎఫ్ సొమ్ముని మినహాయించండి..మీరు కట్టే పిఎఫ్ కంట్రిబ్యూషన్ మాత్రం కలిపే ఉంచాలి.

పన్ను మినహాయింపు కొరే మొత్తం తెలుసుకొండి

అంటే మీ మొత్తం ఆదాయం ఎంత ఉందొ ఎంత ఆదాయానికి పన్ను వర్తిస్తుందొ తెలుసుకొవాలి. దీని కొసం ఫామ్  నంబర్ 26AS. ఫామ్ నంబర్ 26మీద ఇదే మొత్తం వేస్తాం..ఇదే పే స్లిప్స్‌లొని మొత్తం కూడా..!

ప్రయాణ ఖర్చులు, చికిత్స ఖర్చులు

మీకు ఈ రెండు అలవెన్సులు ఇస్తున్నట్లైతే, ఈ రెండింటికి కలిపి రూ.34,200 డిడక్షన్ కింద చూపించవచ్చు. అంటే ప్రయాణఖర్చులు రూ.19,200, చికిత్స భత్యం రూ.15000. ఈ ఏడాది వరకూ ఈ మినహాయింపు పరిమితి కాగా..వచ్చే ఏడాది నుంచి ఈ డిడక్షన్ రూ.40వేల వరకూ చూపించవచ్చు.

హెచ్ఆర్ఏ, ఇతర మినహాయింపు

ఇంటి అద్దె అలవెన్స్, పిల్లల చదువులు, హాస్టల్ అలవెన్స్, ఫుడ్ కూపన్స్ వంటి ఇతరత్రా అన్నీ కలిపి కూడా మినహాయింపు చూపించవచ్చు..ఇంకా ఆదాయపు పన్ను చట్టంలొని సెక్షన్ 80 సి, సెక్షన్ 80సిసి డి 1బి కింద అన్నీ కలిపి రూ.2లక్షల వరకూ పన్ను మినహాయింపు కొరవచ్చును.

ఇతరత్రా ఆదాయాల ప్రకటన

జీతం కాకుండా ఇంకేదైనా మార్గంలొ ఆదాయం వస్తుంటే అంటే ఇళ్లపై అద్దె కానీ, పార్ట్ టైమ్ వ్యాపారం ద్వారా కానీ..ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రూపంలొ కానీ,  వచ్చే ఆదాయాన్ని కూడా అసలు ఆదాయంలొ కలపాలి.

మొత్తం ఆదాయం

పైన చెప్పిన ఆదాయాలన్నీ కలిపి మొత్తం ఆదాయం కింద లెక్క గట్టాలి. అలా అన్ని మినహాయింపులు పొను ఎంత ఆదాయంపై పన్ను గట్టాల్సి వస్తుందొ చూడండి( ఒక వేళ ఆదాయపు పన్ను పరిధిలొ లేకపొతే సున్నా కింద చూపాలి)

అదనపు పన్ను (అవసరమైతే)

పన్ను కట్టిన తర్వాత ఫామ్ నంబర్ 26ఏఎస్‌లొని పన్ను కంటే తక్కువ అయితే ఆ తేడా మొత్తం కట్టాల్సి ఉంటుంది. ఇలా కట్టిన పన్నుకు ఫామ్ నంబర్ 16 అవసరం లేదు. Most Popular