స్వల్ప లాభాలతో- ఎఫ్‌ఎంసీజీ అండ!

స్వల్ప లాభాలతో- ఎఫ్‌ఎంసీజీ అండ!

తొలి నుంచీ హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రస్తుతం కోలుకున్నాయి. సెన్సెక్స్‌ 46 పాయింట్లు పుంజుకుని 35,478ను తాకగా.. నిఫ్టీ 11 పాయింట్లు బలపడి 10,752కు చేరింది. ఎన్‌ఎస్ఈలో ఎఫ్‌ఎంసీజీ 1.1 శాతం లాభపడగా.. ఫార్మా 0.3 శాతం పెరిగింది. రియల్టీ 0.6 శాతం బలహీనపడింది.
ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇండియా సిమెంట్స్, మెక్‌డోవెల్‌, గాడ్‌ఫ్రే ఫిలిప్‌, ఇన్‌ఫ్రాటెల్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, ఐటీసీ, ఎంఅండ్ఎం, కేన్ ఫిన్; అంబుజా సిమెంట్‌ 3.75-2.15 శాతం మధ్య ఎగశాయి. అయితే మరోపక్క ఎస్‌ఆర్‌ఎఫ్‌, హెచ్‌సీసీ, గ్రాన్యూల్స్‌, అదానీ పవర్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, బలరామ్‌పూర్‌, అజంతా ఫార్మా, నాల్కో, సుజ్లాన్‌, మదర్‌సన్ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి.

రియల్టీ కౌంటర్లలో శోభా, ఇండియాబుల్స్‌, ఫీనిక్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ప్రెస్టేజ్‌, బ్రిగేడ్‌ 1.25-0.5 శాతం మధ్య నీరసించాయి.Most Popular