కొత్త టీయూవీతో ఎంఅండ్‌ఎం ప్లస్‌

కొత్త టీయూవీతో ఎంఅండ్‌ఎం ప్లస్‌

ఇప్పటికే మార్కెట్లో విడుదల చేసిన మినీ టీయూవీ-500 వాహనాన్ని మరింత ఆధునీకరించి టీయూవీ-300 ప్లస్‌ పేరుతో మార్కెట్లో విడుదల చేసిన నేపథ్యంలో దేశీ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2.2 శాతం పెరిగి రూ. 902 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 905 వరకూ ఎగసింది. పీ4, పీ6, పీ8 మోడళ్లలో టీయూవీ-500 ప్లస్‌ వాహనాన్ని ప్రవేశపెట్టినట్లు ఎంఅండ్‌ఎం పేర్కొంది. ముంబైలో ఈ ఎస్‌యూవీ వాహనం ఎక్స్‌షోరూమ్‌ ధర రూ. 9.47 లక్షల నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించింది.Most Popular