మార్కెట్‌ ఊగిసలాట- చిన్న షేర్లు నేలచూపు

మార్కెట్‌ ఊగిసలాట- చిన్న షేర్లు నేలచూపు

అంతర్జాతీయంగా బలహీనపడ్డ సెంటిమెంటు కారణంగా దేశీ స్టాక్ మార్కెట్లు ఊగిసలాటకు లోనవుతున్నాయి. స్వల్ప ఒడిదొడుకుల మధ్య సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 27 పాయింట్లు క్షీణించి 35,400కు చేరగా.. నిఫ్టీ 10 పాయింట్ల వెనకడుగుతో 10,731 వద్ద ట్రేడవుతోంది. కాగా.. చిన్న షేర్లలో మరోసారి అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.25 శాతం నష్టంతో ఉన్నాయి. 
నీరసంగా...
బీఎస్ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1327 నష్టపోగా.. 839 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. మిడ్‌ క్యాప్స్‌లో పీఎన్‌బీ హౌసింగ్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, అజంతా ఫార్మా, అదానీ పవర్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, టొరంట్‌ పవర్‌, ఆర్‌పవర్‌, జీఈ టీఅండ్‌డీ, దివీస్‌ లేబ్‌, బ్లూడార్ట్ 4-1.5 శాతం మధ్య నష్టపోయాయి. స్మాల్‌ క్యాప్స్‌లో డ్యుకాన్‌, రేణుకా, స్టీల్‌ ఎక్స్ఛేంజీ, జేవీఎల్‌, ఎఫ్‌ఎస్‌సీ, ఎస్‌ఆర్‌ఎఫ్‌, యారోగ్రీన్‌, జేబీఎఫ్‌, డెక్కన్‌ గోల్డ్‌ తదితరాలు 13-5 శాతం మధ్య పతనమయ్యాయి.
లాభాల్లో...
స్మాల్‌ క్యాప్స్‌లో ఎంటీఎన్‌ఎల్‌, పాలీమెడ్‌, త్రివేణీ, మన్‌పసంద్‌, సర్ధా ఎనర్జీ, ఇండోరమా, సెంట్రమ్‌, ఎఫ్‌డీసీ, నవనీత్‌, సలసర్‌ టెక్నో, గాడ్‌ఫ్రే ఫిలిప్‌ 8-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');