ఫ్లాట్‌గా -బ్యాంక్స్‌ వీక్‌- ఎఫ్‌ఎంసీజీ అప్‌!

ఫ్లాట్‌గా -బ్యాంక్స్‌ వీక్‌- ఎఫ్‌ఎంసీజీ అప్‌!

వాణిజ్య వివాద ఆందోళనలతో బలహీనపడ్డ ప్రపంచ మార్కెట్ల బాటలో దేశీ స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. స్వల్ప ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 20 పాయింట్లు పుంజుకుని 35,453కు చేరగా.. నిఫ్టీ 2 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,743 వద్ద ట్రేడవుతోంది. 
దిగ్గజాల తీరిదీ
ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ 0.7 శాతం లాభపడగా.. ఫార్మా, రియల్టీ, బ్యాంక్‌ నిఫ్టీ 0.3 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్‌ఎం, ఇన్‌ఫ్రాటెల్‌, ఐటీసీ, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌, ఐబీ హౌసింగ్‌, బీపీసీఎల్‌, బజాజ్ ఫిన్‌, జీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.3-0.7 శాతం మధ్య బలపడ్డాయి. అయితే మరోవైపు ఆర్‌ఐఎల్‌, గ్రాసిమ్‌, యూపీఎల్‌, విప్రో, ఇండస్‌ఇండ్, హెచ్‌పీసీఎల్‌, కోల్‌ ఇండియా, అల్ట్రాటెక్, లుపిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ 1.7-0.9 శాతం మధ్య బలహీనపడ్డాయి. 



Most Popular