కాంట్రాక్ట్‌తో కెపాసైట్‌ ఇన్‌ఫ్రా అప్‌!

కాంట్రాక్ట్‌తో కెపాసైట్‌ ఇన్‌ఫ్రా అప్‌!

ముంబై హౌసింగ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ నుంచి భారీ కాంట్రాక్టు లభించినట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల సంస్థ కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 2 శాతం పెరిగి రూ. 294 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 316 వరకూ జంప్‌చేసింది.
రూ. 4357 కోట్లు
టాటా ప్రాజెక్ట్స్‌, సిటిక్‌ కన్‌స్ట్రక్షన్‌తో కలసి ఏర్పాటు చేసిన కన్సార్షియం ద్వారా రూ. 11744 కోట్ల విలువైన కాంట్రాక్టు లభించినట్లు కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ తాజాగా పేర్కొంది. దీనిలో కంపెనీ వాటా 37 శాతంకాగా.. రూ. 4357 కోట్లుగా తెలియజేసింది.Most Popular