రోజంతా కన్సాలిడేషన్‌- చివర్లో అమ్మకాలు!

రోజంతా కన్సాలిడేషన్‌- చివర్లో అమ్మకాలు!

అమెరికా-చైనా మధ్య టారిఫ్‌ వార్‌ నడుస్తున్నప్పటికీ ప్రపంచ మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. దీంతో దేశీయంగానూ మార్కెట్లు తొలుత సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అయితే రోజంతా హెచ్చుతగ్గులకులోనై చివరికి నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 115 పాయింట్లు క్షీణించి 35,432కు చేరింది. నిఫ్టీ 31 పాయింట్ల వెనకడుగుతో 10,741 వద్ద స్థిరపడింది. 
అన్ని రంగాలూ
ఎన్‌ఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ బలహీనపడ్డాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌, ఫార్మా, ఆటో రంగాలు 2-1 శాతం మధ్య తిరోగమించాయి. ఈ బాటలో చిన్న షేర్లలోనూ అమ్మకాలు పెరిగాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ 0.5 శాతం నీరసించగా.. స్మాల్‌ క్యాప్‌ 1 శాతం బలహీనపడింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1754 నష్టపోగా.. 836 మాత్రమే లాభాలతో ముగిశాయి.
దిగ్గజాలు డీలా
నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్‌ఎం, ఇన్‌ఫ్రాటెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టైటన్‌, సన్‌ ఫార్మా, పవర్‌గ్రిడ్‌, హిందాల్కో, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, ఐషర్‌ 2.4-1.5 శాతం మధ్య నష్టపోయాయి. అయితే ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ 4-3.5 శాతం మధ్య జంప్‌చేయగా.. ఐసీఐసీఐ, ఆర్‌ఐఎల్‌, బజాజ్‌ ఫిన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్‌ 1.6-0.5 శాతం మధ్య బలపడ్డాయి. 

ఎఫ్‌ఫీఐల అమ్మకాలు!
నగదు విభాగంలో మంగళవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2443 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 1474 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా గత రెండు రోజుల్లో ఎఫ్‌పీఐలు  రూ. 2025 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా... దేశీ ఫండ్స్‌ రూ. 1478 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. Most Popular