యాక్సిస్‌కేడ్స్‌ ఇంజినీరింగ్‌కు జేవీ జోష్‌!

యాక్సిస్‌కేడ్స్‌ ఇంజినీరింగ్‌కు జేవీ జోష్‌!

ఇంజినీరింగ్‌ సర్వీసుల సంస్థ అసిస్టెమ్‌తో భాగస్వామ్య సంస్థ(జేవీ) ఏర్పాటుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో యాక్సిస్‌కేడ్స్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ జోరందుకుంది. తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 122.50ను తాకింది. ప్రస్తుతం 2.2 శాతం లాభంతో రూ. 119 వద్ద ట్రేడవుతోంది. జేవీ ద్వారా దేశ, విదేశాలలో ఇంధన రంగంలో మౌలిక సదుపాయాలు సమకూర్చే కంపెనీలకు అవసరమయ్యే ఇంజినీరింగ్‌ సర్వీసులను అందించనున్నట్లు యాక్సిస్‌కేడ్స్‌ వివరించింది.Most Popular