ఫైన్‌ ఆర్గానిక్‌కు యాంకర్‌ నిధులు!

ఫైన్‌ ఆర్గానిక్‌కు యాంకర్‌ నిధులు!

నేటి నుంచి(20న) ప్రారంభంకానున్న పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి మంగళవారం నిధులను సమీకరించింది. 15 ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలకు దాదాపు 23 లక్షల షేర్లను కేటాయించడం ద్వారా రూ. 180 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 783 ధరలో గోల్డ్‌మన్‌ శాక్స్ ఇండియా, డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ ఈక్విటీ ఫండ్‌, ఐడీఎఫ్‌సీ స్మాల్‌ క్యాప్‌ ఫండ్ తదితరాలకు ఈక్విటీని జారీ చేసింది.

22న ముగింపు
నేడు ప్రారంభమైన ఐపీవో 22న ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి ఒక్కో షేరుకీ రూ.780-783కాగా తద్వారా రూ.601 కోట్లు సమీకరించాలని ఫైన్‌ ఆర్గానిక్స్‌ భావిస్తోంది. ఇష్యూలో భాగంగా కొత్తగా 76,64,994 షేర్లను కంపెనీ జారీ చేయనుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 19 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. లిక్విడిటీని పెంచుకోవడంతో పాటు, బ్రాండ్‌ను విస్తరించేందుకు ఐపీవో నిధులను వెచ్చించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

కంపెనీ వివరాలివీ 
ముంబైకి చెందిన ఫైన్‌ ఆర్గానిక్స్‌ 2002లో ప్రారంభమైంది. జీవ, వృక్ష సంబంధ నూనెల నుంచి రూపొందించే ఓలియోకెమికల్స్‌ను ఉత్పత్తి చేసే ఈ సంస్థకు మహారాష్ట్రలో  మూడు ప్లాంట్లు కలిగి ఉంది. మొత్తం 387 రకాల ప్రొడక్టులను కంపెనీ తయారు చేస్తోంది. వార్షికంగా 64,300 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కంపెనీ.. ఆర్‌అండ్‌డీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గత మూడేళ్లలో 46 కొత్త ఉత్పత్తులను డెవలప్‌ చేసింది. కంపెనీ కస్టమర్ల జాబితాలో పార్లే, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ తదితర దిగ్గజ కంపెనీలున్నాయి. 



Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');