సెజ్‌ షురూ- మహీంద్రా లైఫ్‌స్పేస్‌ జోరు!

సెజ్‌ షురూ- మహీంద్రా లైఫ్‌స్పేస్‌ జోరు!

రాజస్తాన్‌లోని జైపూర్‌లో విభిన్న ఉత్పత్తుల ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)ని ప్రారంభించినట్లు వెల్లడించడంతో రియల్టీ సంస్థ మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.1 శాతం జంప్‌చేసి రూ. 595 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 598 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం!
జేవీ సెజ్‌
రాజస్తాన్‌ రాష్ట్ర పారశ్రామికాభివృద్ధి కార్పొరేషన్‌(ఆర్‌ఐఐసీవో)తో భాగస్వామ్య ప్రాతిపదికన ఏర్పాటు చేసిన మహీంద్రా వరల్డ్‌ సిటీ జైపూర్‌ సెజ్‌ను ప్రారంభించినట్లు మహీంద్రా లైఫ్‌స్పేస్‌ తాజాగా వెల్లడించింది. తద్వారా రాజస్తాన్‌లో పారిశ్రామిక అభివృద్దికి మరిన్ని అవకాశాలు ఏర్పడనున్నట్లు వ్యాఖ్యానించింది. Most Popular