విదేశీ మార్కెట్ల పతనం- మన మార్కెట్లు సైతం!

విదేశీ మార్కెట్ల పతనం- మన మార్కెట్లు సైతం!

దిగుమతులపై సుంకాలు విధించే అంశంపై అటు అమెరికా.. ఇటు చైనా పట్టుదలకు పోవడంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఆసియాలో చైనాసహా పలు మార్కెట్లు 4-2 శాతం మధ్య పతనంకాగా.. యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు సైతం 1 శాతంపైబడ్డ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దీంతో దేశీయంగానూ అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 226 పాయింట్లు తిరోగమించి 35,322ను తాకాగా.. నిఫ్టీ 77 పాయింట్లు తక్కువగా 10,723 వద్ద ట్రేడవుతోంది.
పీఎస్‌యూ బ్యాంక్స్‌ బోర్లా
ఎన్‌ఎస్ఈలో అన్ని రంగాలూ నష్టపోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ, మెటల్‌, ఐటీ, ఆటో రంగాలు 2-1.2 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, వేదాంతా, ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్, ఎస్‌బీఐ, విప్రో, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్ఎం, అదానీ పోర్ట్స్‌ 4-1.5 శాతం మధ్య పతనమయ్యాయి. కేవలం గెయిల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఓఎన్‌జీసీ, ఎయిర్‌టెల్‌ 1.75-0.5 శాతం మధ్య బలపడ్డాయి.Most Popular