సీఅండ్‌సీ కన్‌స్ట్రక్షన్స్‌కు రుణ రిలీఫ్‌!

సీఅండ్‌సీ కన్‌స్ట్రక్షన్స్‌కు రుణ రిలీఫ్‌!

స్టేట్‌బ్యాంక్‌ అధ్యక్షతన రుణదాతల కన్సార్షియంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడికావడంతో మౌలిక సదుపాయాల సంస్థ సీఅండ్‌సీ కన్‌స్ట్రక్షన్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. నష్టాల మార్కెట్లోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 36.20 వద్ద ఫ్రీజయ్యింది. కంపెనీలో ప్రమోటర్లకు 32.4 శాతం వాటా ఉంది. రుణభారంతో సమస్యలు ఎదుర్కొంటున్న కంపెనీకి ఆర్థిక తోడ్పాటు నందించేందుకు ఎస్‌బీఐ కన్సార్షియం అంగీకరించినట్లు సీఅండ్‌సీ తాజాగా వెల్లడించింది. Most Popular