అమ్మకాల ఒత్తిడి- 200 పాయింట్లు డౌన్‌!

అమ్మకాల ఒత్తిడి- 200 పాయింట్లు డౌన్‌!

అమెరికా- చైనా వాణిజ్య వివాదం ముదిరిన నేపథ్యంలో ఆసియా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ప్రస్తుతం చైనా, జపాన్‌ తదితర దేశాల మార్కెట్లు 3-2 శాతం మధ్య నష్టపోయాయి. దీంతో దేశీయంగానూ అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 202 పాయింట్లు క్షీణించి 35,346కు చేరగా.. నిఫ్టీ 71 పాయింట్లు నీరసించి 10,728ను తాకింది.
అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ నష్టపోగా.. రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌, ఐటీ, ఆటో 1.7-1 శాతం మధ్య తిరోగమించాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐవోసీ, వేదాంతా, హిందాల్కో, ఇన్ఫోసిస్‌, అదానీ పోర్ట్స్‌, గ్రాసిమ్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3.3-1.5 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే గెయిల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, లుపిన్‌, ఎయిర్‌టెల్‌, కొటక్‌ బ్యాంక్‌ 2-0.5 శాతం మధ్య బలపడ్డాయి. Most Popular