కార్డ్స్‌ కేబుల్‌ ఇండస్ట్రీస్‌కు కాంట్రాక్ట్‌ పుష్‌

కార్డ్స్‌ కేబుల్‌ ఇండస్ట్రీస్‌కు కాంట్రాక్ట్‌ పుష్‌

సిగ్నల్‌ కేబుళ్ల సరఫరాకు ఆర్డర్‌ లభించినట్లు వెల్లడించడంతో కార్డ్స్‌ కేబుల్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ నష్టాల మార్కెట్లోనూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 2 శాతం బలపడి రూ. 78 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 81 వరకూ ఎగసింది. పంజాబ్‌లోని హైడ్రోకార్బన్‌ రంగంలో పాలిమర్‌ ఎడిషన్‌ ప్రాజెక్టులో వినియోగించుకునేందుకు వీలుగా విభిన్న కేబుళ్ల సరఫరాకు కాంట్రాక్టు లభించినట్లు కార్డ్స్‌ కేబుల్‌ తాజాగా పేర్కొంది. ఆర్డర్‌ విలువను రూ. 47 కోట్లుగా వెల్లడించింది. Most Popular