ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న రైట్స్‌ ఐపీఓ..

ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న రైట్స్‌ ఐపీఓ..

ఈ ఏడాది ఐపీవోకు వస్తోన్న తొలి ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్(RITES). ఈనెల 20న ప్రారంభమై 22న ముగిసే ఈ ఇష్యూ ద్వారా రూ.466 కోట్ల నిధులను సమీకరించాలని కంపెనీ ప్లాన్‌ చేస్తోంది. రైల్వే ఇంజినీరింగ్, లాజిస్టిక్స్‌ కన్సల్టెన్సీగా సేవలందిస్తోన్న ఈ కంపెనీ ఐపీఓలో భాగంగా 12% వాటాకు సమానమైన 2.52 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఈ ఇష్యూకు ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.180-185గా కంపెనీ నిర్ణయించింది. ఉద్యోగులకు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఇష్యూ ధరలో రూ.6 డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులు కేంద్ర ప్రభుత్వ ఖాతాలో జమ అవుతాయి. ఎలరా క్యాపిటల్‌ (ఇండియా), ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌లు ఈ ఇష్యూకు లీడ్‌ మేనేజర్లుగా ఉన్నాయి.

కంపెనీ నేపథ్యం :
1974లో ప్రారంభమైన రైట్స్‌ (RITES) 2008లో పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా అవతరించింది. రవాణా మౌలిక సదుపాయాలకు సంబంధించిన కన్సల్టెన్సీ సేవలు, ఇంజనీరింగ్‌, డిజైన్‌ విభాగాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. దాదాపు మూడింట రెండువంతుల ఆదాయం ఈ రంగాల నుంచే లభిస్తోంది. లీజింగ్‌, ఎగుమతుల ద్వారా కంపెనీ దాదాపు 30 శాతం ఆదాయం ఆర్జిస్తోంది. గత 44 ఏళ్ళ కాలంలో ఈ సంస్థ ఇప్పటికే 55 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి, ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, దక్షిణ అమెరికా తదితర దేశాలకు కూడా తమ సేవలను విస్తరించింది. 

కంపెనీ క్లయింట్స్‌ :
ఇండియన్‌ రైల్వేస్‌, ఎన్టీపీసీ, సెయిల్‌, రాష్ట్రీయ ఇస్పాట్‌, హెచ్‌పీసీఎల్‌, భారత్‌ కోకింగ్‌ కోల్‌ లి., మెట్రోలింక్‌ ఎక్స్‌ప్రైస్‌ గాంధీనగర్‌ అండ్‌ అహ్మదాబాద్‌ (MEGA), ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్‌ ఇండియా, టిటాగర్‌ వేగన్స్‌, సిమ్కోర, రాజ్‌డీప్‌ బిల్డ్‌కాన్‌, గ్రీన్‌క్రో ఇండియా ఏఆర్‌కే సర్వీసెస్‌లు కంపెనీ మేజర్‌ క్లయింట్స్‌గా ఉన్నాయి. 

ఫైనాన్షియల్స్‌ :
గత ఐదేళ్ళ ఆర్థిక వివరాలను పరిశీలిస్తే కంపెనీ చక్కని వృద్ధిని నమోదు చేస్తోంది. 2013లో రూ.3287 కోట్లుగా ఉన్న కంపెనీ మొత్తం ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.5వేల కోట్లకు చేరింది. ఇక కంపెనీకి ఆర్థిక వివరాలను దిగువ పట్టికలో చూడండి. 


ముఖ్యాంశాలు : 
- ఇష్యూ ప్రారంభం జూన్‌ 20, 2018, ముగింపు జూన్‌ 22, 2018
- ఇష్యూ సైజ్‌ రూ.466 కోట్లు
- ఫేస్‌ వేల్యూ : ఒక్కో షేరుకు రూ.10
-  ధరల శ్రేణి : ఒక్కో షేరుకు రూ.180-185 
- డిస్కౌంట్‌ : రూ.6 (రిటైల్‌, ఉద్యోగులకు)
- రిటైల్‌ పోర్షన్‌ వాటా : 35 శాతం
- మొత్తం జారీ చేసే షేర్లు 2,52,00,000 షేర్లు
- కనీసం 80 షేర్లకు (ఒక లాట్‌) అప్లయ్‌ చేసుకోవాలి
- రూ. 14,800 (For HNI & QIB)
- రూ. 14,320 (For RII & EMP)
- షేర్ల కేటాయింపు : జూన్‌ 28, 2018
- రీఫండ్‌ : జూన్‌ 29, 2018
- డీమ్యాట్‌ అకౌంట్‌లో షేర్ల క్రెడిట్‌ జూల్‌ 02, 2018
- లిస్టింగ్‌ : 03-July-2018 (బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో)Most Popular