బుధవారం ఫైన్‌ ఆర్గానిక్స్‌ ఐపీఓ- ఇవీ వివరాలు...!

బుధవారం ఫైన్‌ ఆర్గానిక్స్‌ ఐపీఓ- ఇవీ వివరాలు...!

ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఐపీవో జూన్‌ 20న ప్రారంభం కానుంది. ఈనెల 22న ముగిసే ఈ ఇష్యూ ధర శ్రేణిని ఒక్కో షేరుకు రూ.780-783గా కంపెనీ నిర్ణయించింది. మొత్తం ఐపీఓ సైజ్‌ రూ.601 కోట్లు కాగా రిటైల్‌ పోర్షన్‌ వాటా 35 శాతంగా ఉంది. ఇష్యూలో భాగంగా కొత్తగా 76,64,994 షేర్లను కంపెనీ జారీ చేయనుంది. కనీసం 19 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవాలి. కంపెనీలో లిక్విడిటీని పెంచుకోవడంతో పాటు, బ్రాండ్‌ను విస్తరించేందుకు ఈ నిధులను వెచ్చించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఇష్యూకు జేఎం ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్‌ ప్రై.లి.‌, ఎడెల్‌వీజ్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌లు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. 

కంపెనీ వివరాలు :
ముంబాయికి చెందిన ఫైన్‌ ఆర్గానిక్స్‌ 2002లో ప్రారంభమైంది. ఓలియోకెమికల్స్‌(జీవ, వృక్ష సంబంధ నూనెల నుంచి తీసేవి)ను ఉత్పత్తి చేసే ఈ సంస్థకు మహారాష్ట్రలో మూడు కర్మాగారాలు(యాంబర్‌నాథ్‌, బడ్లాపూర్‌, దోమ్‌బీవ్‌లీ) ఉన్నాయి. వీటి నుంచి మొత్తం 387 రకాల ఉత్పత్తులను కంపెనీ తయారు చేస్తోంది. మొత్తం 64,300 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ కంపెనీ.. ప్రత్యక్ష్యంగా 500 మందికి ఉపాధినందిస్తోంది. రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన ఈ కంపెనీ 2014 నుంచి ఇప్పటి వరకు 46 కొత్త ఉత్పత్తులను డెవలప్‌ చేసింది. ఫైన్‌ ఆర్గానిక్‌ కస్టమర్ల జాబితాలో పార్లే, హిందూస్థాన్‌ యూనీలీవర్‌ వంటి కంపెనీలున్నాయి. 

కంపెనీ ప్రమోటర్లు :
ప్రకాశ్‌ దామోదర్‌ కామత్‌, 
ముకేశ్‌ మగన్‌లాల్‌ షా,
జ్యోత్నా రమేశ్‌ షా, 
జయెన్‌ రమేశ్‌ షా, 
తుషార్‌ రమేశ్‌ షా, 
బిమల్‌ ముకేశ్‌ షా

ఫైనాన్షియల్స్‌:
గత ఆరేళ్ళుగా కంపెనీ చక్కని లాభాలను ఆర్జిస్తోంది. ఆ వివరాలు దిగువ పట్టికలో చూద్దాం.

ముఖ్యాంశాలు..
- ఇష్యూ ప్రారంభం జూన్‌ 20, 2018
- ఇష్యూ ముగింపు జూన్‌ 22, 2018
- ఐపీఓ సైజ్‌ : రూ.601 కోట్లు
- ఫేస్‌ వాల్యూ : ఒక్కో షేరుకు రూ.5
- ధరల శ్రేణి : ఒక్కో షేరుకు రూ.780-783
- రిటైల్‌ పోర్షన్‌ 35 శాతం
- ఈక్విటీ 76,64,994 షేర్లు
- కనీసం 19 షేర్లకు(ఒకలాట్‌ రూ.14,877) దరఖాస్తు చేసుకోవాలి
- షేర్ల కేటాయింపు : జూన్‌ 28, 2018
- రీఫండ్‌ : జూన్‌ 29, 2018
- డీమ్యాట్‌లో షేర్ల జమ : జులై 02, 2018
- లిస్టింగ్‌ : బీఎస్‌ఈ & ఎన్‌ఎస్‌ఈలో జూలై 03, 2018Most Popular