పీఎంఏవై ఎఫెక్ట్‌- హడ్కో హైజంప్‌

పీఎంఏవై ఎఫెక్ట్‌- హడ్కో హైజంప్‌

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) పథకంలో భాగంగా గృహ నిర్మాణానికి అనుమతించే స్థల పరిమితిని పెంచడంతో హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(హడ్కో) కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రభుత్వ రంగ హౌసింగ్‌ సంస్థ హడ్కో షేరు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 6 శాతం జంప్‌చేసి రూ. 62.30 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 64.35 వరకూ ఎగసింది.
కార్పెట్‌ ఏరియా పెంపు
మధ్యస్థాయి  ఆదాయ వర్గాల(ఎంఐజీ-1)కు ఇచ్చే గృహ రుణాల ద్వారా నిర్మించుకునే ఇంటి స్థల పరిమితి(కార్పెట్‌ ఏరియా)ని ప్రభుత్వం తాజాగా 120 చదరపు మీటర్ల నుంచి 160 చదరపు మీటర్లకు పెంచింది. ఈ బాటలో ఎంఐజీ-2 విభాగంలో గృహ నిర్మాణ పరిమితిని 150 చదరపు మీటర్ల నుంచి 200 చదరపు మీటర్లకు హెచ్చించింది. వెరసి 33 శాతం అధిక పరిమితికి అనుమతించింది. అర్హత కలిగిన ఈ గృహ రుణాలకు వడ్డీ రాయితీ పథకం వర్తించే సంగతి తెలిసిందే



Most Popular