ఫార్మా, ప్రభుత్వ బ్యాంక్స్‌, ఐటీ జోష్‌!

ఫార్మా, ప్రభుత్వ బ్యాంక్స్‌, ఐటీ జోష్‌!

ప్రధానంగా ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఐటీ కౌంటర్లకు పెరిగిన డిమాండ్‌ నేపథ్యంలో మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 168 పాయింట్లు పెరిగి 35,861ను తాకగా.. నిఫ్టీ 47 పాయింట్ల వృద్ధితో 10,890 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా, ఐటీ 2-1.5 శాతం మధ్య ఎగశాయి.
దిగ్గజాల తీరిదీ
నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్‌, సిప్లా, టీసీఎస్‌, హిందాల్కో, లుపిన్‌, ఎస్‌బీఐ, సన్‌ ఫార్మా, టైటన్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ 4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోవైపు టాటా స్టీల్‌, ఐబీ హౌసింగ్‌, అదానీ పోర్ట్స్‌, జీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ 2-0.5 శాతం మధ్య క్షీణించాయి.Most Popular