టాటా స్టీల్‌- థిస్సెన్‌క్రుప్‌ విలీనానికి చెక్‌!

టాటా స్టీల్‌- థిస్సెన్‌క్రుప్‌ విలీనానికి చెక్‌!

టాటా స్టీల్‌ యూరోపియన్‌ విభాగంతో విలీనానికి థిస్సెన్‌క్రుప్‌ ఇన్వెస్టర్లు అడ్డు చెబుతున్నట్లు వెలువడ్డ వార్తలు ఈ కౌంటర్‌ను బలహీనపరచాయి. ప్రస్తుతం టాటా స్టీల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం క్షీణించి రూ. 568 వద్ద ట్రేడవుతోంది. లాభాల మార్కెట్లోనూ తొలుత రూ. 566 వరకూ నీరసించింది. మరింత ఉత్తమ డీల్‌ కోసం టాటా స్టీల్‌తో చర్చలు జరపాల్సిందిగా థిస్సెన్‌క్రుప్‌ను ఇలియట్‌ మేనేజ్‌మెంట్ కోరింది. అయితే ఇలాంటి అవరోధాల కారణంగా డీల్‌ రద్దయ్యే అవకాశంలేదని విశ్లేషకులు చెబుతున్నారు. 2017 సెప్టెంబర్‌లో రెండు సంస్థల మధ్య విలీనానికి అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) కుదిరిన విషయం విదితమే.Most Popular