టొరంట్‌, అరబిందోలకు వయాగ్రా డోస్‌!

టొరంట్‌, అరబిందోలకు వయాగ్రా డోస్‌!

సిల్టెనఫిల్‌ సైట్రేట్‌ జనరిక్స్‌ను అమెరికా మార్కెట్లో విక్రయించేందుకు దేశీ హెల్త్‌కేర్‌ సంస్థలు టొరంట్‌ ఫార్మా, అరబిందో, హెటెరో లేబ్స్‌కు యూఎస్ఎఫ్‌డీఏ నుంచి తాజాగా అనుమతి లభించింది. ఈ ఔషధాన్ని అంతర్జాతీయ దిగ్గజం ఫైజర్‌ వయాగ్రా పేరుతో విక్రయిస్తోంది. కాగా.. సిల్టెనఫిల్‌ సైట్రేట్‌ ట్యాబ్లెట్లను 25 ఎంజీ, 50 ఎంజీ డోసేజీలలో విక్రయించేందుకు దేశీ ఫార్మా కంపెనీలకు తాజాగా అనుమతి లభించింది. వీటిలో 50 ఎంజీ ఔషధానికి 30 కోట్ల డాలర్ల(సుమారు రూ. 2,000 కోట్లు) మార్కెట్‌ ఉన్నట్లు అంచనా. 
షేర్లు ప్లస్‌
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టొరంట్‌ ఫార్మా దాదాపు 1 శాతం పెరిగి రూ. 1416 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1454ను సైతం అధిగమించింది. ఈ బాటలో తొలుత రూ. 606ను అధిగమించిన అరబిందో ఫార్మా షేరు ప్రస్తుతం 598 వద్ద ట్రేడవుతోంది. ఇది 0.3 శాతం అధికం.Most Popular