ఫెడ్‌పై దృష్టి- యూరప్‌ మార్కెట్లు ఫ్లాట్‌!

ఫెడ్‌పై దృష్టి- యూరప్‌ మార్కెట్లు ఫ్లాట్‌!

రెండు రోజుల పాలసీ సమీక్షలో భాగంగా ఫెడరల్‌ రిజర్వ్‌ నేడు పరపతి నిర్ణయాలను ప్రకటించనుంది. ఈసారి కనీసం పావు శాతం వడ్డీ రేటును పెంచే వీలున్నట్లు అత్యధికశాతం మంది విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు గురువారం ఈసీబీ, శుక్రవారం బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ పాలసీ నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం యూకే ఇండెక్స్‌ ఫుట్సీ, జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌  0.2 శాతం స్థాయిలో బలహీనపడగా..  ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ 0.2 శాతం లాభంతో ట్రేడవుతోంది. 
వాణిజ్య వివాద ఎఫెక్ట్‌
ట్రంప్‌, కిమ్‌ సమావేశంలో భాగంగా కొరియాల మధ్య శాంతి స్థాపన, ఉత్తర కొరియా అణు కార్యక్రమాల నిలుపుదల తదితర నాలుగు అంశాలపై సంతకాలు జరగడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే గత వారాంతాన కెనడాలో ముగిసిన సమావేశంలో స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై విధించిన టారిఫ్‌ల పట్ల జీ7 దేశాధి నేతలు వ్యతిరేకతను వ్యక్తం చేసినప్పటికీ  అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పట్టించుకోకపోవడంతో వాణిజ్య వివదాలు ముదిరనున్నట్లు అంచనాలు పెరిగాయి. దీంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. Most Popular