మార్కెట్లకు ఫార్మా, ప్రభుత్వ బ్యాంక్స్‌, ఐటీ దన్ను!

మార్కెట్లకు ఫార్మా, ప్రభుత్వ బ్యాంక్స్‌, ఐటీ దన్ను!

ప్రధానంగా ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఐటీ కౌంటర్లకు పెరిగిన డిమాండ్‌ నేపథ్యంలో మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 145 పాయింట్లు ఎగసి 35,835ను తాకగా.. నిఫ్టీ 37 పాయింట్ల వృద్ధితో 10,880 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా దాదాపు 2 శాతం జంప్‌చేయగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.5 శాతం, ఐటీ 1 శాతం చొప్పున బలపడ్డాయి.
ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో కేడిలా హెల్త్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, పీసీ జ్యువెలర్స్‌, డాక్టర్ రెడ్డీస్‌, సిప్లా, అలహాబాద్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, బీవోబీ గ్రాన్యూల్స్‌, డిష్‌ టీవీ 4-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. మరోవైపు ఐడియా, ఐసీఐసీఐ ప్రు, జీఎంఆర్‌, కేపీఐటీ, సీజీపవర్‌, ఇంజినీర్స్‌ ఇండియా, బీఈఎల్‌, టొరంట్‌ పవర్‌, జస్ట్‌ డయల్‌, ఐబీ హౌసింగ్‌ 5-1.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.Most Popular