స్పీడెక్కిన రుచీ సోయా రేసు- షేరు జూమ్‌

స్పీడెక్కిన రుచీ సోయా రేసు- షేరు జూమ్‌

కంపెనీ కొనుగోలు రేసు స్పీడందుకోవడంతో రుచీ సోయా ఇండస్ట్రీస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ ఊపందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 12.70 వద్ద ట్రేడవుతోంది. భారీ రుణాలు, నష్టాలతో కుదైలైన రుచీ సోయాను కొనుగోలు చేసేందుకు అదానీ విల్మర్‌ వేసిన రూ. 6,000 కోట్ల బిడ్‌ తొలి స్థానంలో నిలవడంతో పోటీ మరింత పెరగనుంది. తొలి నుంచీ రుచీ సోయాపై పతంజలి ఆయుర్వేద ఆసక్తి చూపుతూ వస్తోంది. దీంతో ఇప్పటికే రూ. 5700 కోట్ల బిడ్ దాఖలు చేసిన పతంజలి బిడ్‌ను సవరించేసే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. రేసులో ఇమామీ ఆగ్రోటెక్‌, గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ సైతం పోటీ పడుతున్న విషయం విదితమే.Most Popular