కేఈసీ ఇంటర్నేషనల్‌కు రేటింగ్‌ దన్ను

కేఈసీ ఇంటర్నేషనల్‌కు రేటింగ్‌ దన్ను

విదేశీ బ్రోకింగ్‌ సంస్థ మెక్వారీ ఔట్‌పెర్‌ఫార్మ్‌ రేటింగ్‌ను ప్రకటించడంతో పవర్‌ ట్రాన్స్‌మిషన్ కంపెనీ కేఈసీ ఇంటర్నేషనల్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇనెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2.5 శాతం పెరిగి రూ. 379 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 384 వరకూ ఎగసింది. 
దేశీయంగా రైల్వే విద్యుదీకరణ కేఈసీకి అవకాశాలను పెంచనున్నట్లు మెక్వారీ అభిప్రాయపడింది. మూడేళ్ల కాలంలో ఆదాయం 13 శాతం, నికర లాభం 21 శాతం చొప్పున పుంజుకోగలవని అంచనా వేసింది. Most Popular