లాంగ్‌టర్మ్‌ కోసం ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి..!

లాంగ్‌టర్మ్‌ కోసం ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి..!

గత ఏడాది జోరు మీదున్న దేశీయ మార్కెట్లు 2-3 నెలలుగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోన్నాయి. దీంతో ఫండ్‌మెంటల్‌గా స్ట్రాంగ్‌ ఉన్నప్పటికీ పలు స్టాక్స్‌ కరెక్షన్‌ బాట పట్టాయి. ఈ సమయంలో లాంగ్‌ టర్మ్‌ కోసం 4 స్టాక్స్‌ను కొనుగోలు చేయడం ఉత్తమమని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ రాయ్‌ రికమండ్‌ చేస్తున్నారు. 

ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ :
భారత విమానయాన రంగంలో 40 శాతం మార్కెట్‌ వాటాను కలిగివుంది ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌(పేరెంట్‌ కంపెనీ ఇండిగో ఎయిర్‌లైన్స్‌). ఈ సంస్థ అతి తక్కువ ధరలో సర్వీసులను అందిస్తుందనే పేరుంది. ఇండిగో ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ CAGR(compound annual growth rate) 31 శాతం వృద్ధిని నమోదు చేయగా.. ఇండస్ట్రీ వృద్ధి రేటు మాత్రం 15 శాతంగా ఉంది. మార్కెట్‌ పోటీని తట్టుకోవడానికి ప్రాంతీయ సర్వీసులను పెంచడానికి సంస్థ ప్లాన్‌ చేస్తోంది. లాంగ్‌టర్మ్‌లో చమురు ధరలు ఒడిదుడుకులకు లోనుకావడం సంస్థకు కొంచెం రిస్క్‌ అయినప్పటికీ స్ట్రాంగ్‌ బ్యాలెన్స్‌షీట్‌ను కలిగి ఉండటం, మెరుగైన సర్వీసులను అందిస్తుండడంతో వచ్చే 2-3 సంవత్సరాల్లో ఈ సంస్థ చక్కని రిటర్న్స్‌ అందించే అవకాశముంది. 

ఎన్‌బీసీసీ :
మౌలిక రంగ సంస్థ ఎన్‌బీసీసీ ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌తో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం రూ.80వేల కోట్ల ఆర్డర్‌ బుక్‌ను కలిగివున్న ఈ సంస్థ వచ్చే ఐదేళ్ళలో మరింత విస్తరించడం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాబోయే త్రైమాసికాల్లో రూ.10వేల కోట్ల రీ-డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లను ప్రారంభించనుంది. అతి తక్కువ పోటీ ఉండటం, పెద్ద ప్రాజెక్టులు చేపట్టడంలో అత్యంత నైపుణ్య సంస్థగా పేరు తెచ్చుకోవడం సంస్థకు ప్లస్‌ పాయింట్స్‌గా చెప్పొచ్చు. వచ్చే రెండేళ్ళలో పెద్ద ప్రాజెక్టులైన ప్రగతి మైదాన్‌ (రూ.2,500 కోట్లు), మహారాష్ట్రలో నీటి ప్రాజెక్టులు (రూ.వెయ్యి కోట్లు), న్యూరోజి నగర్‌ రీ-డెవలప్‌మెంట్‌(రూ.2,500 కోట్లు)లను సంస్థ పూర్తి చేయనుంది. లాంగ్‌టర్మ్‌కోసం ఇన్వెస్ట్‌ చేసేవారు ఈ స్టాక్‌పై దృష్టిపెట్టడం మంచిది. 

ఎస్కార్ట్స్‌ :
సాధారణ వర్షపాతం ఉంటుందని ఐఎండీ అంచనాలు వేయడం, వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి సబ్సిడీలు ఇవ్వడానికి చాలా రాష్ట్రాలు ముందుకు రావడంతో FY19లో ట్రాక్టర్స్‌కు చక్కని డిమాండ్‌ ఏర్పడింది. పోర్ట్‌ఫోలియోను విస్తరించడం, ట్రాక్టర్స్‌ టెక్నాలజీని అప్‌గ్రేడ్‌ చేయడంతో కంపెనీ అమ్మకాలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. FY19లో ఆదాయంలో 15 శాతం వృద్ధి, నికరలాభంలో 23 శాతం వృద్ధి నమోదయ్యే ఛాన్స్‌ వుంది. స్ట్రాంగ్‌ ఎర్నింగ్స్‌ ఉండటం, రోడ్డు మౌలిక ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో రాబోయే రోజుల్లో కంపెనీ భారీ వృద్ధిని నమోదు చేసే అవకాశముంది. 2-3 సంవత్సరాల కోసం ఇన్వెస్ట్‌ చేసేవారు ఈ స్టాక్‌ను పరిశీలించడం ఎంతో ఉత్తమం.

అశోక్‌ లేలాండ్‌ :
దేశంలోని రెండో అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్‌ లేలాండ్‌. ప్రభుత్వం రోడ్డు మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టి పెద్ద మొత్తంలో నిధులను కేటాయించడం, ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి, రక్షణాత్మక వ్యూహాలు సంస్థకు ప్లస్‌ పాయింట్లు. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో బ్యాన్‌ ఉన్నప్పటికీ గత ఏడాదితో పోలిస్తే పెద్ద వాహనాల అమ్మకాల్లో 247 శాతం వృద్ధి నమోదైంది. 35.2T- 40.2T కేటగిరీలో 95 శాతం మార్కెట్‌ షేర్‌ను కలిగివుండి ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉంది ఈ సంస్థ. వచ్చే రెండు, మూడేళ్ళ కోసం ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేయొచ్చు.  లాంగ్‌టర్మ్‌లో ఈ స్టాక్‌ చక్కని రిటర్న్స్‌ అందించే ఛాన్స్‌ అవకాశముంది. 

సూచన : ఈ కథనం ద్వారా పైన చెప్పిన షేర్లను కొనమని కానీ..అమ్మమని కానీ ప్రాఫిట్ యువర్ ట్రేడ్.ఇన్ సూచించడం లేదు.. కేవలం ఆ స్టాక్స్ అవగాహన కోసం మాత్రమే కథనాన్ని ప్రచురించాం.Most Popular