ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌ జోరు- మార్కెట్లు అప్‌!

ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌ జోరు- మార్కెట్లు అప్‌!

ప్రధానంగా ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌లో కొనసాగుతున్న కొనుగోళ్లు మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 134 పాయింట్లు ఎగసి 35,826ను తాకగా.. నిఫ్టీ 36 పాయింట్లు పుంజుకుని 10,879 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌, ఫార్మా రంగాలు దాదాపు 2 శాతం జంప్‌చేయగా.. ఐటీ సైతం 1 శాతం బలపడింది.
బ్లూచిప్స్‌ ఇలా
ఫార్మా కౌంటర్లలో డాక్టర్ రెడ్డీస్‌, కేడిలా హెల్త్‌, సిప్లా, లుపిన్‌, సన్‌ ఫార్మా 4-1.75 శాతం మధ్య ఎగశాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌లో అలహాబాద్‌, బీవోబీ, సిండికేట్‌, బీవోఐ, యూనియన్‌, ఇండియన్‌, ఆంధ్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్‌, పీఎన్‌బీ, ఐడీబీఐ 3.6-1 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. నిఫ్టీ దిగ్గజాలలో జీ, ఐబీ హౌసింగ్‌, టాటా స్టీల్‌, వేదాంతా, ఓఎన్‌జీసీ, గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, ఎయిర్‌టెల్‌ 2-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.Most Popular