యూకే కంపెనీలో వాటా - భారత్‌ ఫోర్జ్‌ అప్‌

యూకే కంపెనీలో వాటా - భారత్‌ ఫోర్జ్‌ అప్‌

ఆటో విడిభాగాల దేశీ దిగ్గజం భారత్‌ ఫోర్జ్‌ యూకే కంపెనీ టెవ్వా మోటార్స్‌లో వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడించడంతో వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు దృష్టి సారించడంతో ప్రస్తుతం భారత్‌ ఫోర్జ్‌ షేరు ఎన్‌ఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 665 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 668 వరకూ ఎగసింది. 

రూ. 90 కోట్లు
వాణిజ్య వాహనాలకు ఎలక్ట్రిక్‌ పవర్‌ సొల్యూషన్స్‌ అందించే టెవ్వాలో మొత్తం 34.07 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు భారత్‌ ఫోర్జ్‌ పేర్కొంది. ఇందుకు 10 మిలియన్‌ పౌండ్లను(రూ. 90 కోట్లు) వెచ్చించినట్లు తెలియజేసింది. Most Popular