సుబోగ్జోన్‌పై డాక్టర్‌ రెడ్డీస్‌ చూపు-షేరు ప్లస్‌

సుబోగ్జోన్‌పై డాక్టర్‌ రెడ్డీస్‌ చూపు-షేరు ప్లస్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుబోగ్జోన్‌ ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించనున్న అంచనాలతో దేశీ హెల్త్‌కేర్‌ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ కౌంటర్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.2 శాతం జంప్‌చేసి రూ. 2283 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2304 వరకూ ఎగసింది. మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డ పేషంట్ల చికిత్సలో వినియోగించే సుబోగ్జోన్‌ ఔషధానికి తొలి దశలో పోటీ తక్కువగా ఉండవచ్చన్న అంచనాలు సైతం ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. Most Popular