జాకీ లైసెన్స్‌- పేజ్‌ ఇండస్ట్రీస్‌ దౌడు!

జాకీ లైసెన్స్‌- పేజ్‌ ఇండస్ట్రీస్‌ దౌడు!

జాకీ ఇంటర్నేషనల్‌తో లైసెన్స్‌ను పొడిగించుకున్నట్లు వెల్లడించడంతో పేజ్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ దూకుడు చూపుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 5.4 శాతం జంప్‌చేసి రూ. 26,023 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 26,320 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం! 
జాకీ జోరు
జాకీ బ్రాండు ఇన్నర్‌వేర్‌, ఇతర దుస్తులను దేశీయంగా పేజ్‌ ఇండస్ట్రీస్‌ మార్కెటింగ్‌ చేసే సంగతి తెలిసిందే. కాగా.. జాకీ ఇంటర్నేషనల్‌తో 2040 డిసెంబర్‌వరకూ లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని పొడిగించుకున్నట్లు పేజ్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా పేర్కొంది.Most Popular