మార్కెట్లు ఓకే- చిన్న షేర్లకు డిమాండ్‌!

మార్కెట్లు ఓకే- చిన్న షేర్లకు డిమాండ్‌!

వరుసగా మూడో రోజు ప్రోత్సాహకరంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌  మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 105 పాయింట్లు పెరిగి 35,798కు చేరగా.. నిఫ్టీ 25 పాయింట్లు బలపడి 10,868 వద్ద ట్రేడవుతోంది. కాగా.. మార్కెట్లతోపాటు మరోసారి చిన్న షేర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. దీంతో బీఎస్ఈలో ప్రస్తుతం మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి.
లాభపడ్డవే అధికం
ఇప్పటివరకూ బీఎస్ఈలో ట్రేడైన షేర్లలో 1249 లాభపడగా.. 856 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. మిడ్‌ క్యాప్స్‌లో హడ్కో, పేజ్‌ ఇండస్ట్రీస్‌, వక్రంగీ, టొరంట్‌ ఫార్మా, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, వొకార్డ్‌, భారత్ ఫోర్జింగ్స్‌, ఒబెరాయ్‌ రియల్టీ, అజంతా ఫార్మా 6.5-2 శాతం మధ్య ఎగశాయి. స్మాల్‌ క్యాప్స్‌లోనూ యాడ్‌లేబ్స్‌ 20 శాతం దూసుకెళ్లగా.. లవబుల్‌, ఎస్‌ఎంఎస్‌ ఫార్మా, పీజీ ఎలక్ట్రో, వీఐపీ క్లాతింగ్‌, రెడింగ్టన్‌, నెక్టార్‌ లైఫ్‌, డీబీ రియల్టీ, డెల్టాకార్ప్‌, జీఎం బ్రూవరీస్‌, గుజరాత్‌ బోరోసిల్‌ తదితరాలు 13-5 శాతం మధ్య  జంప్‌చేశాయి. Most Popular