హలోల్‌కు గ్రీన్‌సిగ్నల్‌- సన్‌ ఫార్మా జోరు!

హలోల్‌కు గ్రీన్‌సిగ్నల్‌- సన్‌ ఫార్మా జోరు!

కంపెనీకి కీలకమైన హలోల్‌ ప్లాంటుకి యూఎస్‌ఎఫ్‌డీఏ తాజాగా లోపాలులేవని గుర్తిస్తూ ఈఐఆర్‌ జారీ చేసినట్లు వెల్లడించడంతో సన్‌ ఫార్మా కౌంటర్‌లో ర్యాలీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 3 శాతం పెరిగి రూ. 555 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 561 వరకూ ఎగసింది.
10 కోట్ల డాలర్ల ఎఫెక్ట్‌
దేశీ హెల్త్‌కేర్‌ దిగ్గజం సన్‌ ఫార్మాకు గుజరాత్‌లోని హలోల్‌ ప్లాంటు అత్యంత కీలకంకావడంతో ఇటీవల ఈ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో గత ఐదు రోజులుగా 14 శాతం ఎగసిన సన్‌ ఫార్మా షేరు మరోసారి జోరందుకుంది. 2015 డిసెంబర్‌ నుంచీ దాదాపు ఈ ప్లాంటుకి సంబంధించి సన్‌ ఫార్మా సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. హలోల్‌ ప్లాంటుకి గ్రీన్‌సిగ్నల్ లభించడంతో ఏటా 10 కోట్ల డాలర్ల(సుమారు రూ. 660 కోట్లు)మేర ఆదాయం సమకూరే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.Most Popular