టీసీఎస్‌ బైబ్యాక్‌ బాట- షేరు అప్‌!

టీసీఎస్‌ బైబ్యాక్‌ బాట- షేరు అప్‌!

సొంత షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనను తెరమీదకు తీసుకురావడంతో ఐటీ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్) కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ దిగ్గజం దాదాపు 2 శాతం పెరిగి రూ. 1811 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1819 వరకూ ఎగసింది. 
15న సమావేశం
బైబ్యాక్‌ ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 15న సమావేశం నిర్వహిస్తున్నట్లు టీసీఎస్‌ తాజాగా తెలియజేసింది. కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలలో కొంతమేర వాటాదారులకు ప్రయోజనం చేకూర్చే షేర్ల బైబ్యాక్‌కు వెచ్చించాలని కంపెనీ ప్రణాళికలు వేసింది. కాగా.. క్యూ4లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన టీసీఎస్ నికర లాభం దాదాపు 6 శాతం పెరిగి రూ. 6925 కోట్లను తాకిన సంగతి తెలిసిందే.Most Popular