ఫెడ్‌ వడ్డీ ఆందోళన- ఆసియా నేలచూపు!

ఫెడ్‌ వడ్డీ ఆందోళన- ఆసియా నేలచూపు!

సింగపూర్‌లో ఉత్తర కొరియా నేత కిమ్‌ జాంగ్‌, అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ నిర్వహించిన చరిత్రాత్మక సమావేశం విజయవంతంగా ముగిసినప్పటికీ ఆసియా స్టాక్‌ మార్కెట్లలో నిరుత్సాహం కనిపిస్తోంది. నేడు ఫెడరల్‌ రిజర్వ్‌, గురువారం ఈసీబీ, శుక్రవారం బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ పాలసీ సమీక్షలు ప్రకటించనుండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈసారి పాలసీ సమీక్షలో ఫెడ్‌ వడ్డీ రేటును కనీసం పావు శాతంమేర పెంచనున్నట్లు అంచనాలు పెరిగాయి. దీంతో డాలరు ఇండెక్స్‌ 93.88కు బలపడింది. దీంతో జపనీస్‌ యెన్‌ 110.50కు నీరసించగా.. యూరో 1.174 వద్ద ట్రేడవుతోంది. 
అటూఇటుగా..
ప్రస్తుతం ఆసియా స్టాక్ మార్కెట్లలో సింగపూర్‌, చైనా, హాంకాంగ్‌  1-0.6 శాతం మధ్య బలహీనపడగా.. జపాన్‌ 0.5 శాతం పుంజుకుంది. మిగిలిన మార్కెట్లలో థాయ్‌లాండ్ 0.25 శాతం నీరసించగా, తైవాన్‌ అదే స్థాయిలో లాభపడింది. దక్షిణ కొరియా, ఇండొనేసియా మార్కెట్లకు సెలవు.Most Popular