సెంచరీతో షురూ- ఫార్మా, ఐటీ ఖుషీ!

సెంచరీతో షురూ- ఫార్మా, ఐటీ ఖుషీ!

ట్రంప్‌-కిమ్‌ సింగపూర్‌ సమావేశం విజయవంతంకావడం, ఏప్రిల్‌లో పారిశ్రామికోత్పత్తి పుంజుకోవడం వంటి సానుకూల అంశాల నడుమ దేశీ స్టాక్‌  మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. వరుసగా మూడో రోజు సెన్సెక్స్‌ లాభాల సెంచరీతో మొదలుపెట్టింది. ప్రస్తుతం 133 పాయింట్లు పెరిగి 35,825కు చేరగా.. నిఫ్టీ 32 పాయింట్లు అధికంగా 10,875 వద్ద ట్రేడవుతోంది. 
పీఎస్‌యూ బ్యాంక్స్‌ సైతం
ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ బలపడగా.. ఇటీవల జోరు చూపుతున్న ఫార్మా 1.3 శాతం ఎగసింది. ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌ సైతం 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో సన్‌ ఫార్మా, లుపిన్‌, టీసీఎస్, సిప్లా, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌, టైటన్‌, కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, యస్‌బ్యాంక్‌ 2.5-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఐబీ హౌసింగ్‌ 2 శాతం క్షీణించగా, ఎయిర్‌టెల్‌, జీ, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌, ఐవోసీ, ఓఎన్‌జీసీ 1-0.3 శాతం మధ్య నీరసించాయి. Most Popular