పేజ్‌ ఇండస్ట్రీస్‌కు జాకీ జోష్‌?!

పేజ్‌ ఇండస్ట్రీస్‌కు జాకీ జోష్‌?!

జాకీ ఇంటర్నేషనల్‌తో లైసెన్స్‌ను పొడిగించుకున్నట్లు వెల్లడించడంతో పేజ్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ నేడు వెలుగులో నిలిచే అవకాశముంది. మంగళవారం ఎన్‌ఎస్ఈలో పేజ్‌ షేరు 1.4 శాతం బలపడి రూ. 24,630 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 24,752 వద్ద గరిష్టాన్ని, రూ. 24,204 వద్ద కనిష్టాన్నీ తాకింది. జాకీ బ్రాండు ఇన్నర్‌వేర్‌, ఇతర దుస్తులను దేశీయంగా పేజ్‌ ఇండస్ట్రీస్‌ మార్కెటింగ్‌ చేసే సంగతి తెలిసిందే. కాగా.. జాకీ ఇంటర్నేషనల్‌తో 2040 డిసెంబర్‌వరకూ లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని పొడిగించుకున్నట్లు పేజ్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా పేర్కొంది.Most Popular